Monday, 30 March 2026
  • Home  
  • కాశీబుగ్గ తొక్కిసలాట సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేకే రాజు*
- విశాఖపట్నం

కాశీబుగ్గ తొక్కిసలాట సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేకే రాజు*

*కాశీబుగ్గ తొక్కిసలాట సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేకే రాజు* *ఈ సంఘటనకు ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని ఆరోపణ* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-* శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో వెంకటేశ్వర ఆలయంలో తొక్కేసిలాటలో పది మంది భక్తులు దుర్మరణం చెందిన నేపథ్యంలో విశాఖ జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేకే రాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయని , ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది ఒక నిదర్శనమని కేకే రాజు విమర్శించారు. ప్రభుత్వానికి ఉన్న ఇంటెలిజెన్సీ ప్రకారం ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగినప్పుడు ఎంత మంది భక్తులు వస్తున్నారూ అన్నది అంచనా వేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండగా ఎవరూ పట్టనట్లుగా ఉండడంతో భక్తులు తొక్కిసలాటలో దుర్మరణం పాలవుతున్నారని అన్నారు. నాడు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇటీవలే సింహాచలంలో సంఘటనలు, నేడు కాశీబుగ్గలో జరిగిన సంఘటనలు అధికారులు పాలకులు నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.

*కాశీబుగ్గ తొక్కిసలాట సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేకే రాజు*

*ఈ సంఘటనకు ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని ఆరోపణ*

*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-*
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో వెంకటేశ్వర ఆలయంలో తొక్కేసిలాటలో పది మంది భక్తులు దుర్మరణం చెందిన నేపథ్యంలో విశాఖ జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేకే రాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయని , ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది ఒక నిదర్శనమని కేకే రాజు విమర్శించారు. ప్రభుత్వానికి ఉన్న ఇంటెలిజెన్సీ ప్రకారం ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగినప్పుడు ఎంత మంది భక్తులు వస్తున్నారూ అన్నది అంచనా వేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండగా ఎవరూ పట్టనట్లుగా ఉండడంతో భక్తులు తొక్కిసలాటలో దుర్మరణం పాలవుతున్నారని అన్నారు. నాడు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇటీవలే సింహాచలంలో సంఘటనలు, నేడు కాశీబుగ్గలో జరిగిన సంఘటనలు అధికారులు పాలకులు నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.