విజయవాడ సెంట్రల్ నియోజక వర్గం 57వ డివిజన్లోని NTR నగర్లో నిర్మాణంలో ఉన్న నాగవంశం కళ్యాణ మండప పనులను శనివారం ఉదయం ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పర్యవేక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని, ఇప్పటి వరకు ₹350 కోట్లకు పైగా నిధు లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. బీసీ, ఎస్సీ, మైనార్టీల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, బీసీ భవన్ నిర్మాణంతోపాటు నాగవంశం కళ్యాణ మండప పనులను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు. అవసరమైతే అదనపు నిధులు కూడా మంజూరు చేయించేం దుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నాగవంశ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఎరుబోతు రమణారావు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నాగవంశం కళ్యాణ మండప నిర్మాణానికి ప్రభుత్వ నిధులు మంజూరు చేస్తాం – MLA బొండా ఉమ
విజయవాడ సెంట్రల్ నియోజక వర్గం 57వ డివిజన్లోని NTR నగర్లో నిర్మాణంలో ఉన్న నాగవంశం కళ్యాణ మండప పనులను శనివారం ఉదయం ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పర్యవేక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని, ఇప్పటి వరకు ₹350 కోట్లకు పైగా నిధు లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. బీసీ, ఎస్సీ, మైనార్టీల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, బీసీ భవన్ నిర్మాణంతోపాటు నాగవంశం కళ్యాణ మండప పనులను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు. అవసరమైతే అదనపు నిధులు కూడా మంజూరు చేయించేం దుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నాగవంశ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఎరుబోతు రమణారావు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

