మహిళల భద్రత కోసం శక్తి యాప్
విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి ,; పెందుర్తి ఇన్స్పెక్టర్ కె.వి. సతీష్ కుమార్ ఆదేశాల మేరకు, పెందుర్తి పోలీస్ స్టేషన్ ప్రొబేషనరీ సబ్ ఇన్స్పెక్టర్ వి. చిన్నబాబు పెందుర్తి గవర్నమెంట్ హై స్కూల్‌లో, అలాగే ప్రొబేషనరీ సబ్ ఇన్స్పెక్టర్ జిలానీ వేపగుంటలోని Ortus కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లో విద్యార్థినులతో అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ అవేర్నెస్ కార్యక్రమంలో మహిళల భద్రత కోసం రూపొందించిన “శక్తి యాప్” గురించి విద్యార్థులకు వివరించి, ప్రమాదస్థితుల్లో ఈ యాప్ ఎలా వెంటనే సహాయం అందిస్తుందో అవగాహన కల్పించారు. అదనంగా, మహిళలు తమ భద్రతకు పాటించాల్సిన జాగ్రత్తలు, చట్టపరమైన హక్కులు, అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సహాయం పొందే విధానాలు గురించి సూచనలు అందించారు.
పోలీస్ శాఖ మహిళల భద్రత కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉందని, ఇలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు ముందుకు కూడా కొనసాగుతాయని తెలిపారు.


