-మా గ్రామంలో వెంటనే సిమెంట్ రోడ్డు వేయించండి’:గ్రామస్తుల విజ్ఞప్తి
-బురదమయమైన మార్గంలో రాకపోకలకు ఇబ్బందులు; వ్యాధులు ప్రబలే ప్రమాదం
చిట్వేలి: అక్టోబర్ 23 (పున్నమి ప్రతినిధి)
చిట్వేలి అరుంధతి వాడలోని రహదారుల పరిస్థితి అద్వానంగా తయారైంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మట్టి రోడ్లు పూర్తిగా పాడై, బురదమయంగా మారాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.రోడ్డు పరిస్థితిపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తూ, పిల్లలు, వృద్ధులు ఈ దారిలో నడవాలంటేనే భయపడుతున్నారని తెలిపారు. బురదమయంగా ఉన్న రహదారిలో దోమలు వృద్ధి చెంది, ప్రజలకు జ్వరాలు వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ సమస్యపై వెంటనే అధికారులు స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఏరియా శ్రేయస్సు దృష్ట్యా గ్రామాన్ని పరిశీలించి, వెంటనే సిమెంట్ రోడ్డు వేయించాలని వారు సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు.


