రామవరం, జూలై 27 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి):
అనపర్తి మండలం రామవరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.
మెడికల్ అండ్ హెల్త్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, వేతనాల పెంపు, ఎక్స్‌గ్రేషియా తదితర ఐదు ప్రధాన అంశాలను పరిష్కరించాలని వారు ఎమ్మెల్యేను కోరారు.
కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హామీ ఇచ్చినట్లు జేఏసీ సభ్యులు తెలిపారు.

