Wednesday, 25 March 2026
  • Home  
  • రియల్ హీరోస్‌కి మావందనం — ‘సౌర్యం’ బుక్‌లెట్ ఆవిష్కరించిన నగర సీపీ శంక బ్రత బాగ్చి
- విశాఖపట్నం

రియల్ హీరోస్‌కి మావందనం — ‘సౌర్యం’ బుక్‌లెట్ ఆవిష్కరించిన నగర సీపీ శంక బ్రత బాగ్చి

విశాఖపట్నం, అక్టోబర్ 21: విధి నిర్వర్తనలో ప్రాణాలు అర్పించి ప్రజల శాంతి భద్రతలను కాపాడిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ “రియల్ హీరోస్‌కి మా వందనం” పేరిట రూపొందించిన ‘సౌర్యం’ తెలుగు, ఆంగ్ల బుక్‌లెట్స్‌ను విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంక బ్రత బాగ్చి తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీ బాగ్చి మాట్లాడుతూ — “అమరులైన పోలీసుల ధైర్యసాహసాలు, త్యాగాలు అనితర సాధ్యమైనవి. దేశ రక్షణకోసం, అంతర్గత భద్రత కోసం వారు ప్రాణత్యాగం చేశారు. వారి సేవలకు మనం నమస్కరిస్తూ జరుపుకునేది పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం” అన్నారు. యువతలో సేవాస్ఫూర్తి పెంపొందించేందుకు యూనివర్సల్ యూత్ వాకర్స్ బృందం చేపడుతున్న సామాజిక కార్యక్రమాలను ఆయన అభినందించారు. వాకర్స్ ఇంటర్నేషనల్ యూత్ చైర్‌పర్సన్ వంశీ చింతలపాటి మాట్లాడుతూ — “సమాజ నిర్మాణానికి బలమైన వ్యూహకర్తలైన పోలీసుల త్యాగాలకు నివాళిగా ఈ ‘సౌర్యం’ బుక్‌లెట్ అంకితం చేస్తున్నాం” అన్నారు. యూత్ సమన్వయకర్త లికిత్ బేత తెలిపారు. ఈ బుక్‌లెట్‌ను ద్రోణ కన్సల్టీ అధినేత సురేష్ బేత రచించారని. కార్యక్రమంలో యూత్ వాకర్స్ కార్యదర్శి పి. శ్రీనివాస్ పాల్గొన్నారు.

విశాఖపట్నం, అక్టోబర్ 21:
విధి నిర్వర్తనలో ప్రాణాలు అర్పించి ప్రజల శాంతి భద్రతలను కాపాడిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ “రియల్ హీరోస్‌కి మా వందనం” పేరిట రూపొందించిన ‘సౌర్యం’ తెలుగు, ఆంగ్ల బుక్‌లెట్స్‌ను విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంక బ్రత బాగ్చి తన కార్యాలయంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సీపీ బాగ్చి మాట్లాడుతూ — “అమరులైన పోలీసుల ధైర్యసాహసాలు, త్యాగాలు అనితర సాధ్యమైనవి. దేశ రక్షణకోసం, అంతర్గత భద్రత కోసం వారు ప్రాణత్యాగం చేశారు. వారి సేవలకు మనం నమస్కరిస్తూ జరుపుకునేది పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం” అన్నారు.

యువతలో సేవాస్ఫూర్తి పెంపొందించేందుకు యూనివర్సల్ యూత్ వాకర్స్ బృందం చేపడుతున్న సామాజిక కార్యక్రమాలను ఆయన అభినందించారు.

వాకర్స్ ఇంటర్నేషనల్ యూత్ చైర్‌పర్సన్ వంశీ చింతలపాటి మాట్లాడుతూ — “సమాజ నిర్మాణానికి బలమైన వ్యూహకర్తలైన పోలీసుల త్యాగాలకు నివాళిగా ఈ ‘సౌర్యం’ బుక్‌లెట్ అంకితం చేస్తున్నాం” అన్నారు.

యూత్ సమన్వయకర్త లికిత్ బేత తెలిపారు. ఈ బుక్‌లెట్‌ను ద్రోణ కన్సల్టీ అధినేత సురేష్ బేత రచించారని.
కార్యక్రమంలో యూత్ వాకర్స్ కార్యదర్శి పి. శ్రీనివాస్ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.