ఏపీలో రాబోయే నాలుగు రోజులపాటు వర్ష సూచన
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రాబోయే 48 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం పశ్చిమ–వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉంది. దాంతో ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా. ముఖ్యంగా రేపు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తీర ప్రాంత ప్రజలు వాతావరణ మార్పులను గమనించాలని అధికారులు హెచ్చరించారు. ఈ వర్షాలు వ్యవసాయానికి అనుకూలంగా ఉండే అవకాశం ఉందని అంచనా.

ఏపీలో రాబోయే నాలుగు రోజులపాటు వర్ష సూచన
ఏపీలో రాబోయే నాలుగు రోజులపాటు వర్ష సూచన ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రాబోయే 48 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం పశ్చిమ–వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉంది. దాంతో ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా. ముఖ్యంగా రేపు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తీర ప్రాంత ప్రజలు వాతావరణ మార్పులను గమనించాలని అధికారులు హెచ్చరించారు. ఈ వర్షాలు వ్యవసాయానికి అనుకూలంగా ఉండే అవకాశం ఉందని అంచనా.

