*కల్తీ మద్యం కాదు నాణ్యత మధ్యమే: సిఐ సురేఖ*
పున్నమి ప్రతినిధి సురేష్
కృష్ణాజిల్లా: గన్నవరం నియోజకవర్గం…
గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలో చిల్లీస్ వైన్స్ లో కల్తీ మద్యం అంటూ అసత్య ప్రచారాలు….
చిల్లీస్ వైన్స్ ను తనిఖీ చేసిన ఎక్సేంజ్ సిఐ. సురేఖ…
*వైన్స్ లో విక్రయ దారుడు బైట్స్*
మధ్యాహ్నం 3: 30 నిమిషాలకు వచ్చి ఇద్దరు వ్యక్తులు2 బీర్లు తీసుకువెళ్లారు…
ఆ ఇద్దరు వ్యక్తులు మళ్లీ 4:40 వచ్చి బీర్లు నురగ రావడం లేదని గొడవకు దిగారు…
బీరు గ్యాస్ పోయిన తర్వాత వచ్చి కావాలని కొందరు వ్యక్తులు గొడవకు దిగారు…
*ఎక్సేంజ్ సీఐ సురేఖ కామెంట్స్*
కేసరపల్లి చిల్లీస్ వైన్స్ లో కల్తీ మద్యం అంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు వచ్చాయి….
వైన్స్ లో బీర్ తీసుకొన్న 45 నిమిషాల వ్యవధి తర్వాత తీసుకొని వచ్చి గొడవ పెట్టుకున్నారు….
మా సర్కిల్ పరిధిలో కల్తీ మద్యం లేదు…
మాకు సంబంధించిన 23 షాపుల్లో వారంలో నాలుగు రోజులు తనిఖీ చేస్తాం….
సోషల్ మీడియాలో ఇటువంటి అసత్య ప్రచారం చేయడం వల్ల ప్రజలు భయపడిపోతున్నారు….
కల్తీ మద్యం అంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం….
చిల్లీస్ వైన్స్ లో జరిగిన సంఘటన ను సిసి పుటేజ్ ఆధారంగా వ్యక్తులను గుర్తించి తగు చర్యలు తీసుకుంటాం


