
ఆహారాన్ని దానం చేయడం చాలా గొప్ప పుణ్య కార్యమని, దానాలలో మహాదానం, అన్నదానమని, ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి, బిహెచ్ఆర్సి ఉభయ తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు కొంక్యాన.వేణుగోపాల్ అన్నారు. బి.జి.ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బరాటం.శ్రీనివాస్ చక్రవర్తి ఆధ్వర్యంలో శివతేజ, నగరంలో మంగళవారం అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఇందులో భాగముగా అభాగ్యులకు ఆహారాన్ని అందించి కొంక్యాన.వేణు గోపాల్ మాట్లాడుతూ భూదానం, గోదానం వంటి ఇతర దానాల కన్నా అన్నదానం ముఖ్యమైనదని, ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం అత్యంత పవిత్రమైనదన్నారు. నగరానికి చెందిన ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ఉర్లం.శివతేజ పట్నాయక్ నిరంతరం అన్నప్రసాదాన్ని అందిస్తున్నారని, ఆయన తండ్రి ఉర్లం.నవజీవన రావు మాస్టార్, తల్లి ధనలక్ష్మి అడుగుజాడల్లో నడుస్తూ, సేవలు కొనసాగిస్తున్నారని, శివతేజ నానమ్మ సావిత్రమ్మ వర్ధంతి సందర్భంగా నగరంలో నైట్ షెల్టర్ తోపాటు, డే అండ్ నైట్, సూర్యమహాల్, అరసవల్లి, పాతబస్ స్టాండ్ కూడలిలో నిస్సహాయులకు ఈ రోజు అన్నప్రసాదాన్ని అందించారన్నారు.
బి.జి.ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, విద్యావేత్త, కళాశాలల డైరెక్టర్ బరాటం.శ్రీనివాస్ చక్రవర్తి మాట్లాడుతూ అన్నవితరణ సేవలు చేయడం ద్వారా మోక్షం లభిస్తుందని, ఇది ఆధ్యాత్మికంగా గొప్ప ఫలితాలనిస్తుందని, అన్నదానం అనేది ఆకలితో ఉన్నవారికి ఆహారాన్ని అందించడం ద్వారా చేసే ఒక పవిత్రమైన గొప్ప పుణ్యకార్యమని తెలిపారు. వేడుకలకు ఆహారాన్ని వృధా చేస్తున్నారని, ఆహారం అంధక ఎంతో మంది ఆహారం కోసం ఎదురు చూస్తున్నారని, పేదల కోసం కొంత సమయంతోపాటు, సంపాదనలో కొంత భాగాన్ని సామాజిక సేవలకు వినియోగించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఈ అన్నప్రసాద వితరణలో నైట్ షెల్టర్ నిర్వాహకురాలు వైశ్యరాజు. వెంకట లక్ష్మి, నేటి దాత ఉర్లం. నవజీవన రావు మాస్టర్, కుమారులు, సేవకులు ఉర్లం. శివతేజ పట్నాయక్, సంధ్యారాణి, రవితేజ్, కళ్యాణి, కుటుంబ సభ్యులు, బాడీ బిల్డర్ అసోసియేషన్ కార్యదర్శి విజయ్ కుమార్, వైసిపి ఎస్సి సెల్ జిల్లా జెనెరల్ సెక్రటరీ నల్లబరికి. శ్రీనివాస రావు, తదితరులు పాల్గొన్నారు.

