Sunday, 22 March 2026
  • Home  
  • *క్రీడాకారులకు కూటమి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుంది – మొల్లి పెంటి రాజు*
- విశాఖపట్నం

*క్రీడాకారులకు కూటమి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుంది – మొల్లి పెంటి రాజు*

గాజువాక అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) గాజువాక నియోజకవర్గం, పెదగంట్యాడ, *75* వ వార్డ్ నందు WHEELS OF FIRE స్కేటింగ్ క్లబ్ నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా, *డైరెక్టర్* – *ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్*, విశాఖ జిల్లా తెలుగుయువత ప్రధానకార్యదర్శి *మొల్లి పెంటిరాజు* పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లా రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్ మరియు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జిల్లాస్థాయి పోటీలలో పెదగంట్యాడ ప్రాంతానికి చెందిన విద్యార్థిని, విద్యార్థులు పతాక విజేతలగా నిలిచారు. ఈ ప్రతిభావంతులైన స్కేటర్లు వారి కోచ్ *సంగం మురళి* @ WHEELS OF FIRE స్కేటింగ్ క్లబ్ మార్గదర్శకత్వం కారణంగా, రాష్ట్ర పోటీలలో, విశాఖపట్నం జిల్లాకు ప్రాతినిధ్యం వహించడానికి ఎంపికయ్యారు. నవంబర్ నెలలో కాకినాడలో జరిగే *రాష్ట్ర స్థాయి పోటీలకు* వీరు ఎంపికయ్యారు. క్రీడాకారులు శుభాకాంక్షలు తెలుపుతూ, వారికి తగిన ప్రోత్సాహకాలు అందిస్తానని, వీరు రాష్ట్ర స్థాయిలో కూడా పతకాలు సాధించాలని ఈ సందర్భంగా కోరారు. *విశాఖపట్నం జిల్లా రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్ పతాక విజేతలు:* 1. *6-8 పురుష క్వాడ్:* అండిబోయిన హిమాన్ష్ (1 స్వర్ణం & 1 రజతం) 2. *10-12 మహిళా క్వాడ్:* జెంజి లక్ష్మీ సాయి లౌక్య (3 రజతాలు) 3. *10-12 మహిళా ఇన్‌లైన్:* కాసిన సూర్య నందన (1 కాంస్య) 4. *12-15 మహిళా ఇన్‌లైన్:* అండిబోయిన హేమ వర్షిణి (1 రజతం & 1 కాంస్య) 5. *15-18 మహిళా క్వాడ్:* పోలిశెట్టి శ్రుతి సంయుక్త (2 కాంస్యాలు) *స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జిల్లా పోటీల పతక విజేతలు:* 1. *17 ఏళ్లలోపు:* పోలిశెట్టి శ్రుతి సంయుక్త (2 రజతాలు) 2. *14 ఏళ్లలోపు:* అండిబోయిన హేమ వర్షిణి (1 రజతం & 1 కాంస్య పతకం) ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు, కోచ్ లు, క్రీడాకారులు, తల్లితండ్రులు పాల్గొన్నారు.

గాజువాక అక్టోబర్ (పున్నమి ప్రతినిధి)

గాజువాక నియోజకవర్గం, పెదగంట్యాడ, *75* వ వార్డ్ నందు WHEELS OF FIRE స్కేటింగ్ క్లబ్ నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా, *డైరెక్టర్* – *ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్*, విశాఖ జిల్లా తెలుగుయువత ప్రధానకార్యదర్శి *మొల్లి పెంటిరాజు* పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లా రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్ మరియు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జిల్లాస్థాయి పోటీలలో పెదగంట్యాడ ప్రాంతానికి చెందిన విద్యార్థిని, విద్యార్థులు పతాక విజేతలగా నిలిచారు. ఈ ప్రతిభావంతులైన స్కేటర్లు వారి కోచ్ *సంగం మురళి* @ WHEELS OF FIRE స్కేటింగ్ క్లబ్ మార్గదర్శకత్వం కారణంగా, రాష్ట్ర పోటీలలో, విశాఖపట్నం జిల్లాకు ప్రాతినిధ్యం వహించడానికి ఎంపికయ్యారు. నవంబర్ నెలలో కాకినాడలో జరిగే *రాష్ట్ర స్థాయి పోటీలకు* వీరు ఎంపికయ్యారు. క్రీడాకారులు శుభాకాంక్షలు తెలుపుతూ, వారికి తగిన ప్రోత్సాహకాలు అందిస్తానని, వీరు రాష్ట్ర స్థాయిలో కూడా పతకాలు సాధించాలని ఈ సందర్భంగా కోరారు.
*విశాఖపట్నం జిల్లా రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్ పతాక విజేతలు:*
1. *6-8 పురుష క్వాడ్:* అండిబోయిన హిమాన్ష్ (1 స్వర్ణం & 1 రజతం)
2. *10-12 మహిళా క్వాడ్:* జెంజి లక్ష్మీ సాయి లౌక్య (3 రజతాలు)
3. *10-12 మహిళా ఇన్‌లైన్:* కాసిన సూర్య నందన (1 కాంస్య)
4. *12-15 మహిళా ఇన్‌లైన్:* అండిబోయిన హేమ వర్షిణి (1 రజతం & 1 కాంస్య)
5. *15-18 మహిళా క్వాడ్:* పోలిశెట్టి శ్రుతి సంయుక్త (2 కాంస్యాలు)

*స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జిల్లా పోటీల పతక విజేతలు:*
1. *17 ఏళ్లలోపు:* పోలిశెట్టి శ్రుతి సంయుక్త (2 రజతాలు)
2. *14 ఏళ్లలోపు:* అండిబోయిన హేమ వర్షిణి (1 రజతం & 1 కాంస్య పతకం)
ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు, కోచ్ లు, క్రీడాకారులు, తల్లితండ్రులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.