పున్నమి ప్రతినిధి
SI మేడ ప్రసాద్ ని అభినందించిన పోలీస్ బాస్ లు,
గంజాయి రవాణా చేస్తున్న నిందితుడి అరెస్ట్,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల పరిధిలోని మొరంపల్లి బంజర సమీపంలో బూర్గంపహాడ్ SI మేడ ప్రసాద్ తమ సిబ్బందితో కలిసి గంజాయి అక్రమ రవాణాపై విశ్వనియత సమాచారం మేరకు సోమవారం నాడు చాటుగా మాటు వేసి మెరుపు దాడులు నిర్వహించారు,
చింతూరు నుండి హర్యానాకు చెందిన HR 33B 6330 కారుతో పాటు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని, మంగళవారం పాల్వంచ CI సతీష్ సమక్షంలో మీడియా సమావేశంలో ఓ ప్రకటన విడుదల చేసారు,
ఇట్టి గంజాయి సుమారు 204.930 కిలోలుగా దీని విలువ సుమారు కోటి రూపాయల పైగా అక్షరాల Rs1,02,46,500/- లుగా వెల్లడించారు, నిందితుడు హర్యానా రాష్ట్రానికి చెందిన సంజీవ్ కుమార్ తన కార్ ఓనర్ అయిన ప్రిన్స్ కుమార్ ఆదేశాల ప్రకారం చింతూరు వైపు వెళ్లి అక్కడ ప్రధాన్ ఖారా,లఖన్ హంతాల్ వద్ద గంజాయి లోడ్ చేసుకొని తిరిగి హర్యానా వెళుతుండగా పట్టు పడడం జరిగిందని తెలిపారు,ఎస్సై ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి నిందితుడిని రిమాండ్ కి తరలించారు.


