మూలానక్షత్రం మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పర్యటన నేపథ్యంలో బందోబస్త్ ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహానించిన నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు. మరియు కలెక్టర్ శ్రీ లక్ష్మి శా ఐ.ఏ.ఎస్.గార్లు.
శ్రీ దుర్గామళ్లేశ్వర స్వామి వార్ల దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని అమ్మవారి ధర్శనంలో సామాన్య భక్తులకే పెద్దపీట వేయడమే లక్ష్యంగా చేసుకుని నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్., గారు, జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మి శా ఐ.ఎస్.ఎస్.గార్లు అన్ని శాఖలను సమన్వయం చేసుకుని ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని పటిష్టమైన బందోబస్త్ ఏర్పాట్లను చేయడం జరిగింది.
ఈ క్రమంలో నగర పోలీసు కమిషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్ గారు, జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మి శా ఐ.ఎస్.ఎస్.గార్లు ఉత్సవాలు మొదలైన మొదటి రోజు నుండి అన్నీ శాఖలను సమన్వయం చేసుకుని ఆధునిక డ్రోన్, సి.సి.కెమెరాల ద్వారా కామాండ్ కంట్రోల్ నుండి పర్యవేక్షిస్తూ ఆయా శాఖల సిబ్బందిని అప్రమత్తం చేస్తూ సమిష్టిగా చర్చించుకుని ఎటువంటి చిన్న లోపాలు లేకుండా ఉండేవిధంగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
ది.29.09.2025వ తేదిన మూలనక్షత్రం మరియు ఆనవాయితీ ప్రకారం రాష్ట్రప్రభుత్వం తరుపున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న నేపధ్యంలో ఈ రోజు మోడల్ గెస్ట్ హౌస్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూం నందు నగర పోలీసు కమిషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్ గారు, జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మి శా ఐ.ఎస్.ఎస్.గారు, టెంపుల్ ఈ.ఓ.శ్రీ సినానాయక్ గారు మరియు ఇతర ఉన్నత్తాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో కీలకమైన మూలా నక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకోవడానికి ముందురోజు రాత్రి నుండే అధిక సంఖ్యలో భక్తులు వస్తారని, భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలుగకుండా అమ్మవారి దర్శనం అయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి మరియు ఆ రోజున ఆనవాయితీ ప్రకారం రాష్ట్రప్రభుత్వం తరుపున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి టెంపుల్ కి వస్తున్న నేపథ్యంలో ఎక్కడా ఎటువంటి అవంచనీయ సంఘటనలు జరుగకుండా తీసుకోవాల్సిన పటిష్టమైన బందోబస్త్ ఏర్పాట్ల గురించి కూలంకషంగా చర్చించడం జరిగింది.
ఈ సమీక్షా సమావేశంలో అధికారులు మాట్లాడుతూ చివరి ఐదు రోజుల్లో స్థానిక భక్తులే కాకుండా ఇతర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనం నిమిత్తం వస్తారని, ఈ క్రమంలో ఏర్పాటు చేసిన హోల్డింగ్ ఏరియాల గురించి మరియు అక్కడ భక్తుల కోసం ఏర్పాటు చేయు అవసరాలైన నీరు,పాలు, ఆహారం మొదలైనవి అందే విధంగా చర్యలు తీసుకోవాలని, భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా చూడాలని, అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ మరియు భక్తులతో మర్యాదగా వ్యవహరిస్తూ సంయమనం పాటిస్తూ విధులు నిర్వహించేలాగా అధికారులు కింది స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేయాలని తెలియజేసారు. రొటీన్ బందొబస్త్ లా కాకుండా కొంత మనస్సు పెట్టి భక్తి శ్రద్దలతో విధులు నిర్వహిస్తే భక్తుల మన్ననలతో పాటు, అమ్మవారి ఆశీస్సులు కూడా ఉంటాయని, భక్తి శ్రద్దలతో అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను విజయవంతం చేయాలని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో నగర పోలీసు కమిషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్ గారు, జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మి శా ఐ.ఎస్.ఎస్.గారు, టెంపుల్ ఈ.ఓ.శ్రీ సినానాయక్ గారు, ఎస్.పి.లు శ్రీమతి కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్.గారు, కె.శ్రీనివాస రావు ఐ.పి.ఎస్.గారు, శ్రీ ఆనంద రెడ్డి గారు, ఎస్.వి.డి.ప్రసాద్ గారు, ఏ.డి.సి.పి.లు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.


