మాజీ జెడ్పీటీసీ మోహన్ రెడ్డికి ఘన సన్మానం
కామారెడ్డి, 29 సెప్టెంబర్ పున్నమి ప్రతినిధి. :
కామారెడ్డి అశోక్ నగర్: రామారెడ్డి మండల మాజీ జెడ్పీటీసీ శ్రీ నా రెడ్డి మోహన్ రెడ్డి గారు ఇటీవల అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించు కుని స్వదేశానికి తిరిగి వచ్చిన సందర్భంగా కామా రెడ్డిలోని అశోక్ నగర్ కాలనీ వాసులు ఆయనకు ఘన సన్మానం నిర్వహించారు.ఈ సందర్భంగా కాలనీ సభ్యులు మోహన్ రెడ్డిని శాలువాతో సత్క రించి, ఆయన విదేశీ పర్యటన విశేషాలను అడిగి తెలుసుకున్నారు. మోహన్ రెడ్డి మాట్లాడు తూ, కాలనీ వాసులు చూపించిన అభిమానానికి కృతజ్ఞ తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీకి చెంది న పలువురు ప్రముఖులు, యువకులు పాల్గొన్నా రు. మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.


