పువ్వాడ నాగేంద్ర కుమార్
(పున్నమి ఖమ్మం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ )
ఖమ్మం జిల్లా లో డెంగీ జ్వరాలు దడ పుట్టిస్తున్నాయి. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో 171 డెంగీ కేసులు నమోదవ్వగా 111 డెంగీ ప్రభావిత గ్రామాలను గుర్తించారు. గ్రామాల్లో పారిశుధ్య పనులను చేపట్టండి అని చాలా సమావేశాల్లో జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి ఆదేశాలు ఇస్తునప్పటికి అవి క్షేత్ర స్థాయి లో ఏ మాత్రం ఆచరణ కావడం లేదు. ఇదే అదునుగా బావించిన ఖమ్మం లోని ప్రైవేటు ఆసుపత్రి నిర్వహుకులు ప్రజలని దోచుకుంటున్నారు. ఇప్పటి కీ అయినా ఆరోగ్య అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు


