చిట్వేలి సెప్టెంబరు (పున్నమి ప్రతినిధి)
ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల భాగంగా చిట్వేలి మండలంలో విజయశ్రీ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, జనసేన కార్యకర్తలు, యువత అధిక సంఖ్యలో పాల్గొనిమంగళవారం రక్తదానం చేశారు.
ప్రత్యేకంగా కస్తూరి సురేష్ రక్తదానం చేసి సమాజ సేవలో ఒక మంచి ఉదాహరణగా నిలిచారు. రక్తదానం చేయడం ద్వారా ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చని, ఇది పవిత్రమైన సేవ అని ఆయన పేర్కొన్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన ఈ రక్తదాన శిబిరం, సమాజానికి ఎంతో అవసరమైన కార్యక్రమమని తెలిపారు.జనసేన కార్యకర్తలు మాట్లాడుతూ, సేవా కార్యక్రమాల ద్వారానే పవన్ కళ్యాణ్ పట్ల తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నామన్నారు. రక్తదానం చేయడం ద్వారా అవసరమైన వారికి జీవదానం అందుతుందని, ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని పిలుపునిచ్చారు.స్థానిక ప్రజలు కూడా ఈ శిబిరంలో ఉత్సాహంగా పాల్గొని తమ వంతు సహకారం అందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను కేవలం ఉత్సవాలకే పరిమితం కాకుండా, సేవా కార్యక్రమాలతో మిళితం చేయడం ద్వారా మరింత అర్థవంతంగా చేసుకోవచ్చని పేర్కొన్నారు.


