సెప్టెంబర్ 02 పున్నమి ప్రతినిధి@అమరావతి
విశాఖలో జరిగే ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్సఫర్మేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సదస్సులో కీలకమైన అంశాలపై చర్చించనున్నారు. నేడు మద్యాహ్నం 2.30 గంటలకు విశాఖలోని నోవోటెల్ హోటల్ లో ఈ సదస్సుకు హాజరవుతారు. మారిటైమ్ లాజిస్టిక్స్ పై దృష్టి సారించేలా 20 కంపెనీలకు చెందిన సీఈఓలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. అలాగే మారి టైమ్ రంగంలోని ఆరు స్టార్టప్ లతోనూ సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. బ్లర్గ్స్ ఏఐ, డాకర్ విజన్ , ఓల్టియో మారిటైమ్, ఆటోమాక్సిస్, ఈజీలేన్, ఎయిమ్ లొకేట్ తదితర స్టార్టప్ సంస్థల ప్రతినిధులతో సీఎం సంభాషించనున్నారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలలో భాగంగా ఏపీని గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్ గా తీర్చిదిద్దే అంశంపై ముఖ్యమంత్రి పారిశ్రామిక ప్రతినిధులతో చర్చించనున్నారు. వారి నుంచి సూచనలు సలహాలు తీసుకోనున్నారు. ఈ అంశంపై నిర్వహించనున్న ప్లీనరీ సెషన్ పాల్గోనున్న సీఎం ఏపీ మారి టైమ్ బోర్డు, జీఎఫ్ఎస్టీ సంయుక్తంగా రూపొందించిన వ్యూహాత్మక పత్రాలను విడుదల చేయనున్నారు. అలాగే ఎయిర్ కార్గో ఫోరమ్ ఆఫ్ ఇండియా ఏపీ చాప్టర్ ను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ సమావేశానికి జీఎఫ్ఎస్టీ ఉపాధ్యక్షుడు ఎస్.పి.టక్కర్, ఏపీ మారి టైమ్ బోర్డు అధికారులు, లాజిస్టిక్స్ రంగానికి చెందిన వివిధ కంపెనీల ప్రతినిధులు హాజరు కానున్నారు.

నేడు విశాఖలో ఈస్ట్ కోస్ట్ మారి టైమ్ లాజిస్టిక్స్ సదస్సు హాజరు కానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
సెప్టెంబర్ 02 పున్నమి ప్రతినిధి@అమరావతి విశాఖలో జరిగే ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్సఫర్మేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సదస్సులో కీలకమైన అంశాలపై చర్చించనున్నారు. నేడు మద్యాహ్నం 2.30 గంటలకు విశాఖలోని నోవోటెల్ హోటల్ లో ఈ సదస్సుకు హాజరవుతారు. మారిటైమ్ లాజిస్టిక్స్ పై దృష్టి సారించేలా 20 కంపెనీలకు చెందిన సీఈఓలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. అలాగే మారి టైమ్ రంగంలోని ఆరు స్టార్టప్ లతోనూ సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. బ్లర్గ్స్ ఏఐ, డాకర్ విజన్ , ఓల్టియో మారిటైమ్, ఆటోమాక్సిస్, ఈజీలేన్, ఎయిమ్ లొకేట్ తదితర స్టార్టప్ సంస్థల ప్రతినిధులతో సీఎం సంభాషించనున్నారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలలో భాగంగా ఏపీని గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్ గా తీర్చిదిద్దే అంశంపై ముఖ్యమంత్రి పారిశ్రామిక ప్రతినిధులతో చర్చించనున్నారు. వారి నుంచి సూచనలు సలహాలు తీసుకోనున్నారు. ఈ అంశంపై నిర్వహించనున్న ప్లీనరీ సెషన్ పాల్గోనున్న సీఎం ఏపీ మారి టైమ్ బోర్డు, జీఎఫ్ఎస్టీ సంయుక్తంగా రూపొందించిన వ్యూహాత్మక పత్రాలను విడుదల చేయనున్నారు. అలాగే ఎయిర్ కార్గో ఫోరమ్ ఆఫ్ ఇండియా ఏపీ చాప్టర్ ను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ సమావేశానికి జీఎఫ్ఎస్టీ ఉపాధ్యక్షుడు ఎస్.పి.టక్కర్, ఏపీ మారి టైమ్ బోర్డు అధికారులు, లాజిస్టిక్స్ రంగానికి చెందిన వివిధ కంపెనీల ప్రతినిధులు హాజరు కానున్నారు.

