ఆగస్టు 28 పున్నమి ప్రతినిధి @
ఇప్పటికే సోషల్ మీడియా వెట్టింగ్, తదితర షరతులతో విదేశీ విద్యార్థులకు వీసా నిబంధనలను అమెరికా కఠినతరం చేసింది. ప్రస్తుతం మరో నిబంధనతో గుబులు రేపేందుకు సిద్ధమవుతోంది. విదేశీ విద్యార్థులు నాలుగేళ్లకు మించి యూఎస్‌లో ఉండకుండా వీసా నిబంధనలను మార్చేందుకు చర్యలు చేపడుతోంది. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు చేసింది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న అంతర్జాతీయ విద్యార్థులు ఎంతకాలం చదవాలనుకుంటే లేదా ఇంటర్న్ ప్రోగ్రామ్‌లో పాల్గొనాలనుకుంటే.. అంతకాలం అగ్రరాజ్యంలో ఉండొచ్చు.
అమెరికాలో విద్యార్థి వీసాలకు ‘టైం లిమిట్
ఆగస్టు 28 పున్నమి ప్రతినిధి @ ఇప్పటికే సోషల్ మీడియా వెట్టింగ్, తదితర షరతులతో విదేశీ విద్యార్థులకు వీసా నిబంధనలను అమెరికా కఠినతరం చేసింది. ప్రస్తుతం మరో నిబంధనతో గుబులు రేపేందుకు సిద్ధమవుతోంది. విదేశీ విద్యార్థులు నాలుగేళ్లకు మించి యూఎస్‌లో ఉండకుండా వీసా నిబంధనలను మార్చేందుకు చర్యలు చేపడుతోంది. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు చేసింది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న అంతర్జాతీయ విద్యార్థులు ఎంతకాలం చదవాలనుకుంటే లేదా ఇంటర్న్ ప్రోగ్రామ్‌లో పాల్గొనాలనుకుంటే.. అంతకాలం అగ్రరాజ్యంలో ఉండొచ్చు.

