ఖమ్మం ఆగష్టు
పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి స్టాఫ్ రిపోర్టర్.
శ్రావణమాసపు చివరి ఆదివారం కావడం తో ఆదివారం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న అమ్మవారి దేవాలయాలకి భక్తులు పోటెత్తారు.
అమ్మ వారికి పొంగల్లు నైవేద్యం గా సమర్పించి అలాగే కోళ్ల ను మేకలని అమ్మ వార్లకి బలిచి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మ వారి దయతో అందరు బాగుండాలి అని ఈ సం దర్భముగా పురోహితులు పూజలు చేశారు. ప్రదానం గా ఖమ్మం నగర పరిధిలో ని మారెమ్మ గుడి ఇందిరా నగర్ లోని మైసమ్మ తల్లి గుడి లతో పాటు గా 25మండలాల్లో ఉన్నా అమ్మ వార్ల దేవాలయాలు భక్తులతో కిట కిట లాడాయి.


