ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి )
*విలేకరుల సమావేశం లో మాట్లాడిన ఉపేందర్ గౌడ్
ఆజాదీ. జై పాలస్తీనా నినాదాలు చేస్తు ఖమ్మం లొ ర్యాలీ చేసిన హార్వెస్ట్,న్యువిజన్, BBM విద్యార్దులు.. ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలు తీసుకొని పొలీసులు.సుమోటోగా NIA &CBI సంస్థలు విచారణ జరపాలని భారతీయ జనతా యువమోర్చ ఖమ్మం జిల్లా అధ్యక్షులు అనంతు ఉపేందర్ గౌడ్ డిమాండ్ చేశారు… ఖమ్మం నగరంలో
ప్రవేట్ స్కూల్ యాజమాన్యాలలో విద్యార్థులను స్కూల్ ఫీజులు మరియు భోజనం విషయాలలో విద్యార్థులకుఒత్తిడికి గురి చేసి మానసిక ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నటువంటి విషయాలు చాలా ఉన్నాయని కానీ వాటి మీద స్పందించిన ఈ స్కూల్ యాజమాన్యాలు ప్రపంచంలో ఎక్కడో దాడులు జరిగితే ఖమ్మం టౌన్ లో నిరసిస్తూ అదోలానలు నిరసన ర్యాలీలు చేయడం చాలా బాధాకరం అని అన్నారు.మన దేశం మీద ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు…మన దేశానికి మద్దతుగా కనీసం ర్యాలీలు తియ్యని ఖమ్మంలో కొన్ని ప్రైవేట్ స్కూల్ లు, ఈరోజు పాలిస్తినా దేశం కు మద్దతునిచ్చాయి అంటే సిగ్గుచేటు అని అన్నారు.


