
కంగ్టి మండలంలోని తడ్కల్ గ్రామంలో 30 రోజుల పాటు
నిర్వహించిన కుట్టు మిషన్ శిక్షణ శుక్రవారం పూర్తయిందని
గ్రామ స్వరాజ్య కోఆర్డినేటర్ మహానంద తెలిపారు. గ్రామ
స్వరాజ్య సమస్థ ఆధ్వర్యంలో 40 మంది మహిళలకు
కుటుంబ శిక్షణతోపాటు సర్టిఫికెట్తో పాటు 50%
రాయితీపై మిషన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాఠశాల
ప్రధానోపాధ్యాయురాలు పూజ, ఉపాధ్యాయులు తహుర్,
సవిత, గంగామణి తదితరులు పాల్గొన్నారు.

