బుచ్చిరెడ్డిపాలెము ఫిబ్రవరి 12 ( పున్నమి విలేఖరి )
ప్రముఖ పుణ్యక్షేత్రం జొన్నవాడలో వెలసిఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి అమ్మవార్లు శుక్రవారం ప్రత్యేక పుష్పాలంకరణలో వెండి నందివాహనంపై గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. నెల్లూరు వాస్తవ్యులు రామిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి ధర్మపత్ని శ్రీమతి ఈశ్వరమ్మ మరియు వారి కుటుంబసభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. అనంతరం ఉభయకర్తలను శ్రీవార్ల శేష వస్త్రములతో సత్కరించారు. అధిక సంఖ్యలో భక్తులు గ్రామోత్సవంలో పాల్గొన్నారు.
ఆలయ అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదములు అందజేశారు.
ఈకార్యక్రమంలో చీమల రమేష్ బాబు చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి సభ్యులు,
అర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి
సహాయ కమీషనరు మరియు
కార్యనిర్వహణాధికారి, దేవస్థాన సూపరింటెండెంట్ వి గిరికృష్ణ పాల్గొన్నారు.
బుచ్చిరెడ్డిపాలెము ఫిబ్రవరి 12 ( పున్నమి విలేఖరి ) ప్రముఖ పుణ్యక్షేత్రం జొన్నవాడలో వెలసిఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి అమ్మవార్లు శుక్రవారం ప్రత్యేక పుష్పాలంకరణలో వెండి నందివాహనంపై గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. నెల్లూరు వాస్తవ్యులు రామిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి ధర్మపత్ని శ్రీమతి ఈశ్వరమ్మ మరియు వారి కుటుంబసభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. అనంతరం ఉభయకర్తలను శ్రీవార్ల శేష వస్త్రములతో సత్కరించారు. అధిక సంఖ్యలో భక్తులు గ్రామోత్సవంలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదములు అందజేశారు. ఈకార్యక్రమంలో చీమల రమేష్ బాబు చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి సభ్యులు, అర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి సహాయ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారి, దేవస్థాన సూపరింటెండెంట్ వి గిరికృష్ణ పాల్గొన్నారు.

