Monday, 18 May 2026
  • Home  
  • 7వ డివిజన్ కార్పొరేటర్ దొంగల సత్యనారాయణకు ఘన సత్కారం
- ఖమ్మం

7వ డివిజన్ కార్పొరేటర్ దొంగల సత్యనారాయణకు ఘన సత్కారం

ఖమ్మం, మే పున్నమి జిల్లా ప్రతినిధి: ఖమ్మం నగర కార్పొరేషన్ పరిధిలోని 7వ డివిజన్ నుంచి బీజేపీ కార్పొరేటర్‌గా విజయం సాధించి విజయవంతంగా ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న కార్పొరేటర్ దొంగల సత్యనారాయణను ఖమ్మం టూ టౌన్ బీజేపీ అధ్యక్షుడు ధనియాకుల వెంకట్ నారాయణ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ధనియాకుల వెంకట్ నారాయణ మాట్లాడుతూ, దొంగల సత్యనారాయణ తన పదవీకాలంలో 7వ డివిజన్ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ డివిజన్ అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లారని పేర్కొన్నారు. 7వ డివిజన్ ప్రజలు ఆయన సేవలను గుర్తుంచుకుంటున్నారని, రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మరోసారి ఆయనకు ప్రజలు అవకాశం కల్పించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.

ఖమ్మం, మే
పున్నమి జిల్లా ప్రతినిధి:

ఖమ్మం నగర కార్పొరేషన్ పరిధిలోని 7వ డివిజన్ నుంచి బీజేపీ కార్పొరేటర్‌గా విజయం సాధించి విజయవంతంగా ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న కార్పొరేటర్ దొంగల సత్యనారాయణను ఖమ్మం టూ టౌన్ బీజేపీ అధ్యక్షుడు ధనియాకుల వెంకట్ నారాయణ ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా ధనియాకుల వెంకట్ నారాయణ మాట్లాడుతూ, దొంగల సత్యనారాయణ తన పదవీకాలంలో 7వ డివిజన్ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ డివిజన్ అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లారని పేర్కొన్నారు.

7వ డివిజన్ ప్రజలు ఆయన సేవలను గుర్తుంచుకుంటున్నారని, రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మరోసారి ఆయనకు ప్రజలు అవకాశం కల్పించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.