కూటమి ప్రభుత్వం పెన్షన్ల పంపిణీలో తన నిబద్ధతను మరోసారి చాటుకుంది. ఒకటో తారీఖునే పేదల చేతికి పెన్షన్లు అందించాలనే లక్ష్యంతో నిన్న రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్లు పంపిణీ చేశారు.
గాజువాక నియోజకవర్గం 73వ వార్డులో జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు మరియు విశాఖ జిల్లా కలెక్టర్ శ్రీ ఎం.ఎన్. హరేంద్ర ప్రసాద్ గారు చేతుల మీదుగా పెన్షన్లను పంపిణీ చేశారు.
అనంతరం వార్డు ప్రజలతో అభివృద్ధిపై చర్చా గోష్టి నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ దయానిధి గారు, గాజువాక జోనల్ కమిషనర్ శేషాద్రి గారు, గాజువాక, పెద్దగంట్యాడ ఎమ్మార్వో గార్లు, ఇతర సిబ్బంది మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.
*రౌతు గోవిందరావు*
73వ వార్డు జనసేన అధ్యక్షులు


