ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 24 (పున్నమి ప్రతినిధి)
వెంకటాచలం మండల పరిధిలో అక్రమంగా లారీలో తరలిస్తున్న 59 ఎద్దులు, దూడలను పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. టోల్‌ప్లాజా వద్ద సీఐ సురేంద్రబాబు ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వెళ్తున్న లారీని ఆపి తనిఖీ చేశారు. లారీలో పెద్ద సంఖ్యలో పశువులు ఉండటాన్ని గుర్తించారు. విచారణలో తెలంగాణ నుంచి పశువులను చెన్నై మీదుగా కేరళలోని వధశాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో లారీతో పాటు పశువులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. పశువులను తదుపరి సంరక్షణ కోసం మనుబోలు సంతకు తరలించారు. అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.

59 ఎద్దులు, దూడలు స్వాధీనం
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 24 (పున్నమి ప్రతినిధి) వెంకటాచలం మండల పరిధిలో అక్రమంగా లారీలో తరలిస్తున్న 59 ఎద్దులు, దూడలను పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. టోల్‌ప్లాజా వద్ద సీఐ సురేంద్రబాబు ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వెళ్తున్న లారీని ఆపి తనిఖీ చేశారు. లారీలో పెద్ద సంఖ్యలో పశువులు ఉండటాన్ని గుర్తించారు. విచారణలో తెలంగాణ నుంచి పశువులను చెన్నై మీదుగా కేరళలోని వధశాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో లారీతో పాటు పశువులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. పశువులను తదుపరి సంరక్షణ కోసం మనుబోలు సంతకు తరలించారు. అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.

