నెల్లూరులో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జి.వి.ఆర్.ఆర్ జూనియర్ కళాశాల, భారతీయ విద్యా వికాస్ హైస్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో “హర్ ఘర్ తిరంగా – అనే నేను” కార్యక్రమంలో భాగంగా భారీ దేశభక్తి ర్యాలీ నిర్వహించారు. వనంతోపు సెంటర్, బి.వి. నగర్, కొండయపాలెం గేట్, ఆర్‌కే నగర్ ప్రాంతాల్లో ర్యాలీ సాగింది. జనహిత వాత్సల్య ఆర్గనైజింగ్ సెక్రటరీ జి.వి. సాంబశివరావు, ప్రిన్సిపాల్ డా. బాలాజీ రవికుమార్ జెండా ఊపి ప్రారంభించారు. విద్యార్థులు 500 అడుగుల జాతీయ పతాకంతో దేశభక్తి నినాదాలు చేశారు. ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ దొర్నాదుల వెంకటేశ్వర్లు, ప్రధానోపాధ్యాయుడు మల్లికార్జున రావు, PET లీల అమృత, అధ్యాపకులు, సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు.






