Wednesday, 16 September 2026

Tag: Independence Day

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జనహిత వాత్సల్య ఆశ్రమంలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

వనంతోపు సెంటర్‌లోని జనహిత వాత్సల్య ఆశ్రమంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జె.పి. జైన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను వక్తలు స్మరించారు. ఏపీఎస్పీడీసీఎల్ రిటైర్డ్ సీనియర్ అసిస్టెంట్ షేక్ మీరా సాహెబ్ తన పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమ పిల్లల అభ్యున్నతికి ₹లక్ష విరాళం అందించారు. ఆయన సేవలను చేజర్ల సుధాకర్‌రావు అభినందించారు. విద్యార్థులు చదువు, క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో రాణించాలని అతిథులు ఆకాంక్షించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో జి.వి. సాంబశివరావు, బి. రామదండు, పి. శ్రీనివాస్, డాక్టర్ ఎ.బి. రవికుమార్, డి. నగేష్‌రెడ్డి, జైన్ ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

500 అడుగుల త్రివర్ణ పతాకంతో భారీ దేశభక్తి ర్యాలీ

నెల్లూరులో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జి.వి.ఆర్.ఆర్ జూనియర్ కళాశాల, భారతీయ విద్యా వికాస్ హైస్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో “హర్ ఘర్ తిరంగా – అనే నేను” కార్యక్రమంలో భాగంగా భారీ దేశభక్తి ర్యాలీ నిర్వహించారు. వనంతోపు సెంటర్, బి.వి. నగర్, కొండయపాలెం గేట్, ఆర్‌కే నగర్ ప్రాంతాల్లో ర్యాలీ సాగింది. జనహిత వాత్సల్య ఆర్గనైజింగ్ సెక్రటరీ జి.వి. సాంబశివరావు, ప్రిన్సిపాల్ డా. బాలాజీ రవికుమార్ జెండా ఊపి ప్రారంభించారు. విద్యార్థులు 500 అడుగుల జాతీయ పతాకంతో దేశభక్తి నినాదాలు చేశారు. ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ దొర్నాదుల వెంకటేశ్వర్లు, ప్రధానోపాధ్యాయుడు మల్లికార్జున రావు, PET లీల అమృత, అధ్యాపకులు, సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

తోటి భారత సోదర, సోదరీమణులకు హృదయపూర్వక స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

తోటి భారత సోదర, సోదరీమణులకు హృదయపూర్వక స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. 🇮🇳 ఆగస్టు 15 మన క్యాలెండర్‌లోని సాధారణ తేదీ కాదు. కోట్లాది భారతీయుల త్యాగాలకు, పోరాటాలకు, మహనీయుల ఆశయాలకు ప్రతీకగా నిలిచిన పవిత్రమైన రోజు. స్వాతంత్ర్యం కోసం ఎందరో తమ కుటుంబాలను, సుఖాలను, చివరకు ప్రాణాలను సైతం త్యాగం చేశారు. వారి త్యాగాల ఫలితంగానే మనం నేడు స్వేచ్ఛగా జీవిస్తున్నాం. స్వాతంత్ర్యం అంటే కేవలం హక్కులను అనుభవించడం కాదు; బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తించడం కూడా. ఉపాధ్యాయుడు బోధనతో, రైతు శ్రమతో, వైద్యుడు సేవతో, పోలీసు అంకితభావంతో, సైనికుడు ధైర్యంతో దేశ నిర్మాణంలో భాగస్వాములు అవుతున్నారు. మనం చేసే ప్రతి పనిని దేశానికి చేస్తున్న సేవగా భావించాలి. మన మధ్య అభిప్రాయాలు వేరైనా మనల్ని కలిపేది భారతీయత. ఐక్యత, క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వం, పరస్పర గౌరవం మన బలాలు. ప్రకృతిని పరిరక్షిద్దాం. అవినీతి, అన్యాయం, వివక్షలకు దూరంగా ఉందాం. మన పిల్లలకు మంచి విలువలు, మంచి సమాజం, శక్తివంతమైన భారతదేశాన్ని అందిద్దాం. మన హృదయాల్లో దేశభక్తి… మన చేతల్లో బాధ్యత… మన లక్ష్యంలో భారతదేశ ప్రగతి. జై హింద్! 🇮🇳 వందే మాతరం! 🇮🇳 K. శ్రీనివాస రావు విశ్రాంత అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, నెల్లూరు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.