నెల్లూరు రూరల్ అభివృద్ధిలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. 40 ఏళ్ల నాటి పొట్టేపాలెం కలుజు సమస్యకు శాశ్వత పరిష్కారంగా రూ.5.60 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఈ పనులను టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు. సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, మంత్రి బి.సి. జనార్దన్ రెడ్డిల సహకారంతో ఈ కల సాకారమవుతోంది. గతంలో నిలిచిపోయిన ఈ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఆగస్టు-సెప్టెంబర్ లోగా బ్రిడ్జిని ప్రజలకు,అందుబాటులోకి తెస్తామని గిరిధర్ రెడ్డి స్పష్టం చేశారు.

40 ఏళ్ల సమస్యకు మోక్షం: పొట్టేపాలెం బ్రిడ్జి పనులు శరవేగం!