వాకాడు పంచాయతీ పరిధిలోని శివాలయం సమీపంలో ఉన్న గిరిజన కాలనీ అంగన్వాడి కేంద్రం వద్ద ఇటీవల కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసి దృష్టిలోపం ఉన్నవారిని గుర్తించారు.
జాతీయ సేవా పథకం దినోత్సవం సందర్భంగా కోట మండలం చెందోడు గ్రామానికి చెందిన ఎం వి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 20 మంది మహిళలకు ఉచితంగా కంటి అద్దాలు అందజేశారు.
జాతీయ సేవా పథకం దినోత్సవం( NSS ) ను పురస్కరించుకొని ప్రతి ఒక్కరు తనకున్నంతలో సేవ చేయాలన్న సదుద్దేశం వచ్చిన నాడే నిరుపేదలు ఉండాలని ఆ కార్యక్రమంలో భాగంగా గురువారం 12 వేల కార్యక్రమంగా గిరిజన కాలనీలో మహిళలకు ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎం.వి రావు ఫౌండేషన్ చైర్మన్
ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ కార్యదర్శి ఎం విజయలక్ష్మి అంగన్వాడి టీచర్ సిబ్బంది మహిళలు పాల్గొన్నారు



