19వ డివిజన్‌లో ఇంటింటి ప్రచారం
పున్నమి ప్రతినిధి
కడప, సెప్టెంబర్ 29: “మన కడప – స్వచ్ఛ కడప” కార్యక్రమంలో భాగంగా కడప నగరంలోని 19వ డివిజన్‌లో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు, జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసులరెడ్డి గారు ఆదేశాల మేరకు 19వ డివిజన్ కన్వీనర్ రంజిత్ గారి ఆధ్వర్యంలో అప్పారావు బిల్డింగ్స్ ప్రాంతంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని ప్రజలను ఇంటింటికీ కలిసి కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు, జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసులరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు.
అలాగే స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, బూత్ ఇంచార్జ్‌లు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










