Thursday, 24 September 2026
  • Home  
  • ‘పిడికిలి వదిలినప్పుడు’ కవితా సంపుటి ఆవిష్కరణ
- సాహితీ

‘పిడికిలి వదిలినప్పుడు’ కవితా సంపుటి ఆవిష్కరణ

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ పరిపాలన భవనంలో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షవర్గ సభ్యులు, సార్క్ సాహిత్య పురస్కార గ్రహీత డాక్టర్ పెరుగు రామకృష్ణ రచించిన తాజా కవితా సంపుటి *‘పిడికిలి వదిలినప్పుడు’*ను విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ సాహిత్యం సమాజాన్ని చైతన్యపరిచే సాధనమని అన్నారు. సమాజంలో వస్తున్న మార్పులు, మానవ సంబంధాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలను కవులు తమ రచనల్లో ప్రతిబింబించాలని పేర్కొన్నారు. మంచి సాహిత్యం పాఠకుల్లో ఆలోచనను రేకెత్తించడంతో పాటు మానవీయ విలువలను పెంపొందిస్తుందని తెలిపారు. డాక్టర్ పెరుగు రామకృష్ణ తన రచనల ద్వారా సామాజిక అంశాలను సున్నితంగా స్పృశిస్తున్నారని అభినందించారు. డాక్టర్ పెరుగు రామకృష్ణ మాట్లాడుతూ ‘పిడికిలి వదిలినప్పుడు’లో మానవ సంబంధాలు, ప్రేమ, ఆత్మీయత, సామాజిక సమస్యలు, శ్రమజీవుల జీవితాలకు సంబంధించిన అంశాలను కవితలుగా మలిచినట్లు తెలిపారు. సాధారణ మనిషి జీవితంలో ఎదురయ్యే అనుభవాలను సరళమైన భాషలో పాఠకులకు చేరువ చేసే ప్రయత్నం చేశానన్నారు. తన కవితా సంపుటిని విశ్వవిద్యాలయంలో ఉపకులపతి ఆవిష్కరించడం ఆనందంగా ఉందని తెలిపారు. అనంతరం ఉపకులపతి డాక్టర్ పెరుగు రామకృష్ణను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ తెలుగు శాఖాధిపతి ఆచార్య మణికంఠ, సహాయక ఆచార్యులు చిన్నం రాజారాం, కుమ్మెత్తల లక్ష్మీ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ పరిపాలన భవనంలో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షవర్గ సభ్యులు, సార్క్ సాహిత్య పురస్కార గ్రహీత డాక్టర్ పెరుగు రామకృష్ణ రచించిన తాజా కవితా సంపుటి *‘పిడికిలి వదిలినప్పుడు’*ను విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ సాహిత్యం సమాజాన్ని చైతన్యపరిచే సాధనమని అన్నారు. సమాజంలో వస్తున్న మార్పులు, మానవ సంబంధాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలను కవులు తమ రచనల్లో ప్రతిబింబించాలని పేర్కొన్నారు. మంచి సాహిత్యం పాఠకుల్లో ఆలోచనను రేకెత్తించడంతో పాటు మానవీయ విలువలను పెంపొందిస్తుందని తెలిపారు. డాక్టర్ పెరుగు రామకృష్ణ తన రచనల ద్వారా సామాజిక అంశాలను సున్నితంగా స్పృశిస్తున్నారని అభినందించారు.
డాక్టర్ పెరుగు రామకృష్ణ మాట్లాడుతూ ‘పిడికిలి వదిలినప్పుడు’లో మానవ సంబంధాలు, ప్రేమ, ఆత్మీయత, సామాజిక సమస్యలు, శ్రమజీవుల జీవితాలకు సంబంధించిన అంశాలను కవితలుగా మలిచినట్లు తెలిపారు. సాధారణ మనిషి జీవితంలో ఎదురయ్యే అనుభవాలను సరళమైన భాషలో పాఠకులకు చేరువ చేసే ప్రయత్నం చేశానన్నారు. తన కవితా సంపుటిని విశ్వవిద్యాలయంలో ఉపకులపతి ఆవిష్కరించడం ఆనందంగా ఉందని తెలిపారు.
అనంతరం ఉపకులపతి డాక్టర్ పెరుగు రామకృష్ణను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ తెలుగు శాఖాధిపతి ఆచార్య మణికంఠ, సహాయక ఆచార్యులు చిన్నం రాజారాం, కుమ్మెత్తల లక్ష్మీ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.