ఖానాపురం పున్నమి ప్రతినిధి:
మాజీ మంత్రివర్యులు గౌరవ తన్నీరు హరీష్ రావు గారిని ఈరోజు వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన వరంగల్ జిల్లా మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి గారు .
దివంగత నేత & మాజీ శాసనసభ్యులు స్వర్గీయ శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారితో వారికున్న ఉద్యమ జ్ఞాపకాలని, అనుబంధాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ కేటీఆర్ గారితో కలిసి నర్సంపేట నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో త్వరలో సమావేశాన్ని ఏర్పాటు చేసి నియోజకవర్గ పరిస్థితులపై సమీక్షిస్తామని హరీష్ రావు గారు తెలిపారు.



