Sunday, 27 September 2026
  • Home  
  • మహిళా సంఘాల బలోపేతమే లక్ష్యం రుణాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి CRPల సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలి – ఏపీఎం ఆంజనేయులు
- కడప

మహిళా సంఘాల బలోపేతమే లక్ష్యం రుణాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి CRPల సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలి – ఏపీఎం ఆంజనేయులు

లింగ సమానత్వం, మహిళా సంరక్షణకు గ్రామస్థాయిలో ప్రత్యేక కార్యాచరణ వేముల మండలం, సెప్టెంబర్ 26: మహిళా స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేసి, ప్రతి మహిళను ఆర్థికంగా స్వావలంబన దిశగా నడిపించేందుకు సమన్వయంతో పనిచేయాలని వెలుగు–డీఆర్‌డీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆంజనేయులు సూచించారు. వేముల మండలం శ్రీ శక్తి భవన్‌లో వేముల మండల మహిళా సమాఖ్య కార్యవర్గ సమావేశం మండల సమాఖ్య అధ్యక్షురాలు శ్రీమతి శ్రీలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మి మాట్లాడుతూ, స్వయం సహాయక సంఘాలు, గ్రామ సమాఖ్యలు పొందిన రుణాలను నిర్దేశిత ప్రయోజనాలకు సక్రమంగా వినియోగించుకుని స్థిరమైన జీవనోపాధులను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రుణ వినియోగం ద్వారా కుటుంబ ఆదాయాన్ని పెంచుకునే దిశగా సంఘ సభ్యులు ముందుకు సాగాలని కోరారు. CRPల సేవలను సద్వినియోగం చేసుకోవాలి సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన ఏపీఎం ఆంజనేయులు మాట్లాడుతూ, మండల మహిళా సమాఖ్య, గ్రామ సమాఖ్యల కార్యకలాపాలను వేగవంతం చేయడంలో కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ (CRPs) కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. వేముల మండలంలో పనిచేస్తున్న ఈ-నారి CRPs, FL-CRPs, IBC-CRPs, జెండర్ CRPs, విత్తసఖి, బీమా సఖి, APO-CRPs తదితరుల సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. ఆయా కార్యకలాపాల పురోగతిని ఎప్పటికప్పుడు నవీకరించడంతో పాటు, గ్రామస్థాయిలో మహిళలకు అవసరమైన సేవలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. లింగ సమానత్వంపై ప్రత్యేక దృష్టి మహిళల సంరక్షణ, భద్రత మరియు లింగ సమానత్వం సాధించేందుకు జెండర్ రిసోర్స్ సెంటర్ ద్వారా అవగాహన, సహాయక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఏపీఎం తెలిపారు. ప్రతి గ్రామ సమాఖ్యలో సోషల్ యాక్షన్ సబ్-కమిటీ, ప్రతి స్వయం సహాయక సంఘంలో జెండర్ రిసోర్స్ పర్సన్‌లను ఎంపిక చేసి వారికి అవసరమైన శిక్షణ అందించాలని కమ్యూనిటీ కోఆర్డినేటర్లకు సూచించారు. మహిళా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ప్రతి మహిళ ఉద్యమిగా, పారిశ్రామికవేత్తగా ఎదిగేలా అవసరమైన ఆర్థిక సహకారం, రుణ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని ఆంజనేయులు సూచించారు. శ్రీనిధి, సామాజిక పెట్టుబడి నిధి (CIF), ఉన్నతి, PMFME, PMEGP తదితర పథకాల ద్వారా అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకుని ఆదాయ వనరులను పెంపొందించుకోవాలని తెలిపారు. మహిళా సంఘాల ఆర్థిక బలోపేతం, జీవనోపాధుల అభివృద్ధి, సామాజిక సాధికారత కోసం సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో గ్రామ సమాఖ్యల అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు, కమ్యూనిటీ కోఆర్డినేటర్లు జ్యోతి, జైపాల్, గంగరాజు, హరికృష్ణ, నాగేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

లింగ సమానత్వం, మహిళా సంరక్షణకు గ్రామస్థాయిలో ప్రత్యేక కార్యాచరణ

వేముల మండలం, సెప్టెంబర్ 26:
మహిళా స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేసి, ప్రతి మహిళను ఆర్థికంగా స్వావలంబన దిశగా నడిపించేందుకు సమన్వయంతో పనిచేయాలని వెలుగు–డీఆర్‌డీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆంజనేయులు సూచించారు.

వేముల మండలం శ్రీ శక్తి భవన్‌లో వేముల మండల మహిళా సమాఖ్య కార్యవర్గ సమావేశం మండల సమాఖ్య అధ్యక్షురాలు శ్రీమతి శ్రీలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీలక్ష్మి మాట్లాడుతూ, స్వయం సహాయక సంఘాలు, గ్రామ సమాఖ్యలు పొందిన రుణాలను నిర్దేశిత ప్రయోజనాలకు సక్రమంగా వినియోగించుకుని స్థిరమైన జీవనోపాధులను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రుణ వినియోగం ద్వారా కుటుంబ ఆదాయాన్ని పెంచుకునే దిశగా సంఘ సభ్యులు ముందుకు సాగాలని కోరారు.

CRPల సేవలను సద్వినియోగం చేసుకోవాలి

సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన ఏపీఎం ఆంజనేయులు మాట్లాడుతూ, మండల మహిళా సమాఖ్య, గ్రామ సమాఖ్యల కార్యకలాపాలను వేగవంతం చేయడంలో కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ (CRPs) కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.

వేముల మండలంలో పనిచేస్తున్న ఈ-నారి CRPs, FL-CRPs, IBC-CRPs, జెండర్ CRPs, విత్తసఖి, బీమా సఖి, APO-CRPs తదితరుల సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. ఆయా కార్యకలాపాల పురోగతిని ఎప్పటికప్పుడు నవీకరించడంతో పాటు, గ్రామస్థాయిలో మహిళలకు అవసరమైన సేవలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

లింగ సమానత్వంపై ప్రత్యేక దృష్టి

మహిళల సంరక్షణ, భద్రత మరియు లింగ సమానత్వం సాధించేందుకు జెండర్ రిసోర్స్ సెంటర్ ద్వారా అవగాహన, సహాయక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఏపీఎం తెలిపారు. ప్రతి గ్రామ సమాఖ్యలో సోషల్ యాక్షన్ సబ్-కమిటీ, ప్రతి స్వయం సహాయక సంఘంలో జెండర్ రిసోర్స్ పర్సన్‌లను ఎంపిక చేసి వారికి అవసరమైన శిక్షణ అందించాలని కమ్యూనిటీ కోఆర్డినేటర్లకు సూచించారు.

మహిళా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

ప్రతి మహిళ ఉద్యమిగా, పారిశ్రామికవేత్తగా ఎదిగేలా అవసరమైన ఆర్థిక సహకారం, రుణ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని ఆంజనేయులు సూచించారు. శ్రీనిధి, సామాజిక పెట్టుబడి నిధి (CIF), ఉన్నతి, PMFME, PMEGP తదితర పథకాల ద్వారా అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకుని ఆదాయ వనరులను పెంపొందించుకోవాలని తెలిపారు.

మహిళా సంఘాల ఆర్థిక బలోపేతం, జీవనోపాధుల అభివృద్ధి, సామాజిక సాధికారత కోసం సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.

ఈ సమావేశంలో గ్రామ సమాఖ్యల అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు, కమ్యూనిటీ కోఆర్డినేటర్లు జ్యోతి, జైపాల్, గంగరాజు, హరికృష్ణ, నాగేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.