రాష్ట్ర అభివృద్ధికి సైకో మూకలే అడ్డంకి. చంద్రబాబు 18 గంటలు శ్రమిస్తూ ఏపీని పునర్నిర్మిస్తున్నారు. బుగ్గవాగు ప్రాజెక్టుకు రూ.1.28 కోట్లతో కొత్త గేట్లు
రెంటచింతల, జూలై 04 (పున్నమి ప్రతినిధి) :“దేవతల రాజధాని అమరావతిపై మావిగన్ మారీచుడి అవతారమెత్తిన జగన్ రెడ్డి కుట్రలు పన్నారు. పిట్టలదొర మాదిరిగా పూటకో రాజధాని పేరు చెప్పి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు” అని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.గుంటల రోడ్లు – అప్పుల ఊబి: “జగన్ దాష్టిక పాలనకు గుంటలు పడిన రోడ్లు, రాజధాని లేని రాష్ట్రం, అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆర్థిక పరిస్థితే నిదర్శనం. ఒక్క చాన్స్ అంటూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు” అని మండిపడ్డారు. అభివృద్ధికి అడ్డుపడే మూకలు: రాష్ట్రాభివృద్ధికి వైసీపీ సైకో మూకలే ప్రధాన అవరోధంగా మారారని ఆరోపించారు.“ఓటు విలువ తెలిసిన నాయకుడు చంద్రబాబు. ఆయన 18 గంటలు శ్రమిస్తూ కొవ్వొత్తిలా కరిగిపోతూ రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నారు. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు రేయింబవళ్లు కష్టపడుతున్నారు” అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.20 ఏళ్ల చీకటి – రెండేళ్ల వెలుగు: “మాచర్ల నియోజకవర్గంలో 20 ఏళ్లుగా మచ్చుకైనా కనిపించని అభివృద్ధి, కూటమి ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలోనే పరుగులు పెడుతోంది” అని స్పష్టం చేశారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ నూతన జలకళ సంతరించుకుంటున్నాయన్నారు.ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరిన బుగ్గవాగు ప్రాజెక్ట్‌కు రూ.1 కోటి 28 లక్షలతో నాలుగు కొత్త గేట్లు అమర్చి సాగునీటిని సంరక్షిస్తున్నామని తెలిపారు.ఈ సమావేశంలో టీడీపీ మండల అధ్యక్షుడు చపారపు అబ్బిరెడ్డి, నాయకులు గొంటు సుమంత్ రెడ్డి, మున్నా ప్రభురాజు, శొంఠిరెడ్డి నర్సిరెడ్డి, మందలపు హనిమిరెడ్డి,బోడపాటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


