*పవన్ కళ్యాణ్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై జనసేనలో చేరిక*
విశాఖపట్నం: భీమిలి నియోజకవర్గంలో జనసేన పార్టీకి మరింత బలం చేకూరింది. భీమునిపట్నం మండలం టీ.నగరపాలెం గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ *పల్లా వెంకటరావు* జనసేన పార్టీలో చేరారు.
జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి జనసేనలో చేరినట్లు ఆయన తెలిపారు.
జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారి చేతుల మీదుగా పల్లా వెంకటరావు పార్టీ కండువా కప్పుకున్నారు. భీమిలి నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు శ్రీ పంచకర్ల సందీప్ గారి సమక్షంలో ఈ చేరిక జరిగింది.
*సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత*
పల్లా వెంకటరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీ.నగరపాలెం గ్రామ సర్పంచ్‌గా సేవలందించడంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ల సంఘం మాజీ కార్యదర్శిగా, జిల్లా యాదవ సంఘం ఉపాధ్యక్షులుగా పలు కీలక బాధ్యతలు నిర్వహించారు.
స్థానికంగా సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన చేరికతో భీమిలి నియోజకవర్గంలో పార్టీ మరింత బలపడుతుందని నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా పల్లా వెంకటరావు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని, భీమిలిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

