Tuesday, 29 September 2026
  • Home  
  • గ్రామాభివృద్ధికి బాటలు.. ధార్ కుభీర్, బెల్గావ్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం
- నిర్మల్

గ్రామాభివృద్ధికి బాటలు.. ధార్ కుభీర్, బెల్గావ్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం

కుభీర్ మండలంలోని ధార్ కుభీర్, బెల్గావ్ గ్రామాల్లో అభివృద్ధి పనులకు ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ శ్రీకారం చుట్టారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ధార్ కుభీర్‌లో మహిళా సమైక్య సంఘ భవనం, గోదాం నిర్మాణానికి, బెల్గావ్‌లో వీవో భవనాలు, అంగన్‌వాడీ కేంద్రం, గోదాం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను కలిసిన గ్రామస్థులు తమ గ్రామాల్లోని ప్రధాన సమస్యలను వివరించారు. ధార్ కుభీర్ నుంచి బెల్గావ్ వరకు రహదారి సౌకర్యం మెరుగుపరచడంతో పాటు ప్రజల రాకపోకలకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. బెల్గావ్‌లో చెరువు నీటిని పంట పొలాలకు అందించేందుకు రెండు కెనాల్స్‌ నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామస్థుల వినతులపై స్పందించిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్.. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. చెరువుల అభివృద్ధి, సాగునీటి సౌకర్యం, పంట పొలాలకు రహదారులు, విద్యుత్‌ స్తంభాల ఏర్పాటు వంటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామాల మధ్య రాకపోకలు సులభతరం చేసేందుకు బీటీ రోడ్లు, అంతర్గత రహదారులకు సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం వంటి పనులను చేపట్టేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. భూగర్భ జలాల పెంపునకు ఇంకుడు గుంతల నిర్మాణం, నీటి సంరక్షణ చర్యలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల్లో ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులను దశలవారీగా చేపడుతూ మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, మండల నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

కుభీర్ మండలంలోని ధార్ కుభీర్, బెల్గావ్ గ్రామాల్లో అభివృద్ధి పనులకు ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ శ్రీకారం చుట్టారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ధార్ కుభీర్‌లో మహిళా సమైక్య సంఘ భవనం, గోదాం నిర్మాణానికి, బెల్గావ్‌లో వీవో భవనాలు, అంగన్‌వాడీ కేంద్రం, గోదాం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేను కలిసిన గ్రామస్థులు తమ గ్రామాల్లోని ప్రధాన సమస్యలను వివరించారు. ధార్ కుభీర్ నుంచి బెల్గావ్ వరకు రహదారి సౌకర్యం మెరుగుపరచడంతో పాటు ప్రజల రాకపోకలకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. బెల్గావ్‌లో చెరువు నీటిని పంట పొలాలకు అందించేందుకు రెండు కెనాల్స్‌ నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.
గ్రామస్థుల వినతులపై స్పందించిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్.. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. చెరువుల అభివృద్ధి, సాగునీటి సౌకర్యం, పంట పొలాలకు రహదారులు, విద్యుత్‌ స్తంభాల ఏర్పాటు వంటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
గ్రామాల మధ్య రాకపోకలు సులభతరం చేసేందుకు బీటీ రోడ్లు, అంతర్గత రహదారులకు సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం వంటి పనులను చేపట్టేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. భూగర్భ జలాల పెంపునకు ఇంకుడు గుంతల నిర్మాణం, నీటి సంరక్షణ చర్యలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
గ్రామాల్లో ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులను దశలవారీగా చేపడుతూ మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, మండల నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.