నంద్యాల: అయ్యలూరుమెట్ట సమీపంలో కనిపించకుండా పోయిన నెల రోజుల పసికందును చెట్ల పొదల్లో గుర్తించి కాపాడిన వ్యక్తి సమయస్ఫూర్తిని నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ సుస్మిత అభినందించారు. ఈ మేరకు ఆ వ్యక్తిని సత్కరించి ప్రోత్సాహక బహుమతి అందించారు. సెప్టెంబర్ 5న పసికందుతో సహా తల్లి అదృశ్యమవ్వగా కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో దారిపక్కన పొదల్లో ఉన్న శిశువును సదరు వ్యక్తి గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఆ పసికందును తండ్రికి సురక్షితంగా అప్పగించారు. పసికందు అక్కడికి ఎలా చేరిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు.

పొదల్లో పసికందు.. ఆదుకున్న మానవత్వం! రక్షించిన వ్యక్తికి ఏఎస్పీ సత్కారం