Sunday, 27 September 2026
  • Home  
  • అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం అతిరాలలో అంగరంగ వైభవంగా గంగా హారతి.. గిరి ప్రదక్షిణ
- అన్నమయ్య

అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం అతిరాలలో అంగరంగ వైభవంగా గంగా హారతి.. గిరి ప్రదక్షిణ

హత్యరాల,కామాక్షి సమేత త్రేతేశ్వర స్వామి క్షేత్రంలో శనివారం పౌర్ణమి సందర్భంగా గంగా హారతి, గిరి ప్రదక్షిణ కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ, గిరి ప్రదక్షిణ భక్త మండలి కమిటీ ఏర్పాట్లు చేసింది. సాయంత్రం 6 గంటలకు గంగా హారతి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా కాశీ, తిరుమలలో నిర్వహించే హారతి విధానాలను ఆదర్శంగా తీసుకుని 16 రకాల హారతులతో బహుదా నదికి ప్రత్యేక గంగా హారతి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ ఇన్‌చార్జి చమర్తి జగన్మోహన్ రాజు వేద పండితుల సమక్షంలో ఆలయ కమిటీ, గిరి ప్రదక్షిణ కమిటీలకు హారతి సామగ్రిని అందజేశారు. ఈ ప్రత్యేక గంగా హారతి కార్యక్రమాన్ని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వీక్షించాలని నిర్వాహకులు కోరారు. అలాగే ఈ నెల గంగా హారతి, అన్నప్రసాద వితరణకు అవసరమైన చీర, సారెను కావుటూరు సుధాకర్ నాయుడు ధర్మపత్ని నాగమణి, మేడా సుబ్బారెడ్డి ధర్మపత్ని బుజ్జమ్మ సంయుక్తంగా అందిస్తున్నారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు స్వామివారి కృపాకటాక్షాలు కలగాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. భక్తుల సౌకర్యార్థం చల్లటి మంచినీటి ఏర్పాట్లను ఆలయ చైర్మన్ పూల నాగమణి కుటుంబ సభ్యులు చేస్తున్నారు. గిరి ప్రదక్షిణ అనంతరం భక్తులు తిరుగు ప్రయాణంలో ఇబ్బందులు పడకుండా చెర్రీస్ స్కూల్ యాజమాన్యం, రాజు స్కూల్ యాజమాన్యం బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. పౌర్ణమి సందర్భంగా నిర్వహించే గంగా హారతి, గిరి ప్రదక్షిణలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని శ్రీశ్రీశ్రీ కామాక్షి సమేత త్రేతేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ భక్త మండలి కమిటీ కోరింది.

హత్యరాల,కామాక్షి సమేత త్రేతేశ్వర స్వామి క్షేత్రంలో శనివారం పౌర్ణమి సందర్భంగా గంగా హారతి, గిరి ప్రదక్షిణ కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ, గిరి ప్రదక్షిణ భక్త మండలి కమిటీ ఏర్పాట్లు చేసింది. సాయంత్రం 6 గంటలకు గంగా హారతి ప్రారంభం కానుంది.

ఈ సందర్భంగా కాశీ, తిరుమలలో నిర్వహించే హారతి విధానాలను ఆదర్శంగా తీసుకుని 16 రకాల హారతులతో బహుదా నదికి ప్రత్యేక గంగా హారతి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ ఇన్‌చార్జి చమర్తి జగన్మోహన్ రాజు వేద పండితుల సమక్షంలో ఆలయ కమిటీ, గిరి ప్రదక్షిణ కమిటీలకు హారతి సామగ్రిని అందజేశారు. ఈ ప్రత్యేక గంగా హారతి కార్యక్రమాన్ని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వీక్షించాలని నిర్వాహకులు కోరారు.

అలాగే ఈ నెల గంగా హారతి, అన్నప్రసాద వితరణకు అవసరమైన చీర, సారెను కావుటూరు సుధాకర్ నాయుడు ధర్మపత్ని నాగమణి, మేడా సుబ్బారెడ్డి ధర్మపత్ని బుజ్జమ్మ సంయుక్తంగా అందిస్తున్నారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు స్వామివారి కృపాకటాక్షాలు కలగాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.

భక్తుల సౌకర్యార్థం చల్లటి మంచినీటి ఏర్పాట్లను ఆలయ చైర్మన్ పూల నాగమణి కుటుంబ సభ్యులు చేస్తున్నారు. గిరి ప్రదక్షిణ అనంతరం భక్తులు తిరుగు ప్రయాణంలో ఇబ్బందులు పడకుండా చెర్రీస్ స్కూల్ యాజమాన్యం, రాజు స్కూల్ యాజమాన్యం బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నాయి.

పౌర్ణమి సందర్భంగా నిర్వహించే గంగా హారతి, గిరి ప్రదక్షిణలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని శ్రీశ్రీశ్రీ కామాక్షి సమేత త్రేతేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ భక్త మండలి కమిటీ కోరింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.