వరికుంటపాడు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం డీఈఓ బాలాజీరావు, అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకట సుబ్బయ్య సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని లీప్ యాప్, మినిస్ట్రీ డ్యాష్‌బోర్డు, వివిధ రికార్డులను పరిశీలించారు. పాఠశాల విద్యా ప్రమాణాలు, విద్యార్థుల ప్రగతిపై ఉపాధ్యాయులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి వారి చదువు, లక్ష్యాలపై ఆరా తీశారు. విద్యార్థులు కష్టపడి చదివి పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని, భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని విద్యార్థులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

వరికుంటపాడులో డీఈఓ పర్యటన