డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా :
మలికిపురం మండలం రామరాజులంక బాడవ పల్లిపాలెంలో రాజోలు ఎమ్మెల్యే శ్రీ దేవ వరప్రసాద్ గారు ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక మత్స్యకార కుటుంబాలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, విద్యుత్, మంచినీటి సౌకర్యాలతో పాటు మత్స్యకారులకు సంబంధించిన పలు సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ ప్రాంతంలో నివసిస్తున్న సుమారు 100 మత్స్యకార కుటుంబాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం సంబంధిత అధికారులతో సమస్యలపై చర్చించి, అవసరమైన చర్యలు త్వరగా చేపట్టాలని సూచించారు. ప్రజల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.



