*పీ ఆర్సీ నివేదిక తెప్పించుకొని వెంటనే అమలు చేయాలి*
*పాఠశాలలను కుదించాలనే ఆలోచనను విరమించుకోవాలి*
*టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి డిఎస్. నాగేశ్వరరావు*
ఏన్కూర్ జులై 2: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లలు తెలంగాణ రెండవ పీ ఆర్సీ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని 2023 జూలై నుంచి అమలు కావలసిన నూతన పి ఆర్సీ పై ప్రభుత్వం వెంటనే నివేదిక తెప్పించుకొని సంఘాలతో చర్చించి అమలు చేయాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి డిఎస్. నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల మరియు బాలుర ఉన్నత పాఠశాలలో టీఎస్ యుటిఎఫ్ సభ్యత్వ క్యాంపెయిన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో మూసివేసిన ప్రతి పాఠశాలలను తెరిపిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు పాఠశాలల సంఖ్యను కుదిస్తామనటం సమంజసం కాదని, వెంటనే ఆ ఆలోచనను విరమించుకోవాలన్నారు. హెల్త్ కార్డుల విధి విధానాలను రూపొందించి వెంటనే అమలు చేయాలని, 2024 మార్చి నుంచి రిటైర్డ్ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలన్నారు . పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, నిత్యావసర ధరలు పెరుగుతున్నందున పెండింగ్లో ఉన్న ఆరు డిఏ లను వెంటనే విడుదల చేయాలన్నారు. హెల్త్ కార్డులపై వెంటనే వైద్యం అందించాలని కోరారు. గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న పండిట్స్ పిఈటీ పోస్టులను అప్గ్రేట్ చేస్తూ పదోన్నతి కల్పించాలన్నారు. మోడల్ స్కూల్స్, కేజీబీవీ, యుఆర్ఎస్ సిఆర్టి ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టిఎస్ యుటిఎఫ్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.రామ్ చంద్,మూడ్ పుల్లయ్య, ఉపాధ్యక్షురాలు వి. శ్రీదేవి,కోశాధికారి బి. నరసింహారావు టీఎస్ యుటిఎఫ్ సీనియర్ నాయకులు రాఘవరావు, శంకర్రావు, మండల నాయకులు బి.రవికుమార్, జి.శైలజ,ఏ.కృష్ణ బి. లక్ష్మ తదితరులు పాల్గొన్నారు.


