Friday, 3 July 2026
  • Home  
  • వంద మందిలో పదిహేను మందినీ గుర్తించలేకపోయారు: ఆర్‌డీవో అనూష ఆగ్రహం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వంద మందిలో పదిహేను మందినీ గుర్తించలేకపోయారు: ఆర్‌డీవో అనూష ఆగ్రహం

నెల్లూరు, జూలై 3 (పున్నమి ప్రతినిధి): నెల్లూరు రూరల్ మండలంలో నిర్వహించిన బీపీఎల్ సర్వేలో తీవ్ర నిర్లక్ష్యం వెలుగుచూసిందని ఆర్‌డీవో అనూష మండిపడ్డారు. వంద మందిలో కనీసం పదిహేను మంది అర్హులను కూడా గుర్తించలేకపోవడం సర్వే నిర్వహణలో వైఫల్యానికి నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. నిర్లక్ష్యంగా విధులు నిర్వహించిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ ఐదుగురు సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. బేతాల నరేంద్ర, లక్ష్మీ ప్రసాంతి, నందం గోపికృష్ణ, షేక్ నసీన్, పుసుగోటి చెంచుకేశవులు తక్షణమే వివరణ ఇవ్వాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.