Sunday, 27 September 2026
  • Home  
  • ధవళేశ్వరం బ్యారేజీ వద్ద పెరుగుతున్న గోదావరి ప్రవాహం.. అధికారుల అప్రమత్తం
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ధవళేశ్వరం బ్యారేజీ వద్ద పెరుగుతున్న గోదావరి ప్రవాహం.. అధికారుల అప్రమత్తం

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో సుమారు 5 లక్షల క్యూసెక్కులకు చేరినట్లు అధికారులు తెలిపారు. ప్రవాహం ఇదే స్థాయిలో కొనసాగితే రాత్రికి తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని సమాచారం. గోదావరి ప్రవాహ పరిస్థితులపై విపత్తుల నిర్వహణ సంస్థ సంబంధిత అధికారులను అప్రమత్తం చేసింది. పోలవరం, ఉమ్మడి గోదావరి, కాకినాడ, ఏలూరు, డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాల అధికారులను అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా లంక గ్రామాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.