డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: జిల్లా పరిషత్ చైర్మన్ పదవిపై టీడీపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాబోయే జడ్పీ చైర్మన్ పదవి జనరల్ కేటగిరీకి రిజర్వ్ అయితే, ఆ పదవికి జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి గంధం పల్లం రాజు పేరు పరిశీలనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
టీడీపీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న పల్లం రాజుకు జడ్పీ చైర్మన్ పదవి దక్కే అవకాశాలపై పార్టీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది.
అదే సమయంలో మంత్రి నారా లోకేష్, రాష్ట్ర మంత్రి సుభాష్‌తో పల్లం రాజుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే జడ్పీ చైర్మన్ పదవికి తుది నిర్ణయం రిజర్వేషన్, పార్టీ అధిష్ఠానం నిర్ణయం, రాజకీయ సమీకరణాలపై ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది.

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జడ్పీ చైర్మన్ రేసులో గంధం పల్లం రాజు
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: జిల్లా పరిషత్ చైర్మన్ పదవిపై టీడీపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాబోయే జడ్పీ చైర్మన్ పదవి జనరల్ కేటగిరీకి రిజర్వ్ అయితే, ఆ పదవికి జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి గంధం పల్లం రాజు పేరు పరిశీలనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. టీడీపీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న పల్లం రాజుకు జడ్పీ చైర్మన్ పదవి దక్కే అవకాశాలపై పార్టీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. అదే సమయంలో మంత్రి నారా లోకేష్, రాష్ట్ర మంత్రి సుభాష్‌తో పల్లం రాజుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే జడ్పీ చైర్మన్ పదవికి తుది నిర్ణయం రిజర్వేషన్, పార్టీ అధిష్ఠానం నిర్ణయం, రాజకీయ సమీకరణాలపై ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది.

