Friday, 3 July 2026
  • Home  
  • కేంద్ర మంత్రికి ముక్కంటి ప్రసాదాలు అందజేసిన ఎమ్మెల్యే బొజ్జల
- తిరుపతి

కేంద్ర మంత్రికి ముక్కంటి ప్రసాదాలు అందజేసిన ఎమ్మెల్యే బొజ్జల

శ్రీ కాళహస్తి, జులై 02 : (పున్నమి న్యూస్) : తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో నిర్వహించిన ‘వీబీ-జీ రామ్ జీ’ (వికసిత్ భారత్ గ్యారంటీ) పథకం ప్రారంభ కార్యక్రమాన్ని ముగించుకుని తిరుగుప్రయాణమైన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు రేణిగుంట విమానాశ్రయం వద్ద ఘన వీడ్కోలు లభించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర ముఖ్య నేతలతో కలిసి శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కేంద్ర మంత్రికి హృదయపూర్వక వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రిని ఆత్మీయంగా కలుసుకున్న బొజ్జల సుధీర్ రెడ్డి.. శ్రీకాళహస్తీశ్వర స్వామి పవిత్ర తీర్థప్రసాదాలు, శేషవస్త్రాన్ని అందజేసి స్వామివారి దివ్య ఆశీస్సులు అందించారు. అలాగే ఈ ప్రాంత చారిత్రాత్మక వైభవాన్ని చాటిచెప్పే ‘గుడిమల్లం కాఫీ టేబుల్ బుక్’ ను బహూకరించి, ఆ ఆలయ శతాబ్దాల నాటి ఘన చరిత్రను కేంద్ర మంత్రికి వివరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.