నంద్యాల పద్మావతి నగర్ ప్రధాన రహదారిపై ఏర్పాటు చేస్తున్న ఇనుప డివైడర్ల పనులు అసంపూర్తిగా వదిలేయడంతో వాహనదారులు, పాదచారులకు ప్రమాద ముప్పు ఏర్పడుతోందని ఎస్‌డీపీఐ నంద్యాల అసెంబ్లీ కమిటీ సభ్యుడు వి. హనీఫ్ తెలిపారు.కొంత దూరం వరకు డివైడర్లు ఏర్పాటు చేసినా రంగులు వేయకపోవడంతో తుప్పు పడుతున్నాయని, మరికొన్ని చోట్ల కేవలం ఇనుప పైపులు ఏర్పాటు చేసి పనులు నిలిపివేశారని పేర్కొన్నారు. రాత్రి వేళల్లో ఇవి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందన్నారు.రోడ్డు ప్రారంభోత్సవంతో పాటు డివైడర్ల పనులను పూర్తిస్థాయిలో పూర్తి చేసి, రంగులు, భద్రతా సూచికలు ఏర్పాటు చేయాలని ఎస్‌డీపీఐ డిమాండ్ చేసింది. ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించకుండా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని వి. హనీఫ్ కోరారు.

ప్రారంభోత్సవం ఘనం.. డివైడర్లు అసంపూర్తి