Wednesday, 23 September 2026
  • Home  
  • ఉదయగిరి: డాక్టర్ సునీతకు ఘన వీడ్కోలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి: డాక్టర్ సునీతకు ఘన వీడ్కోలు

ఉదయగిరి SMGR ప్రభుత్వ వ్యవసాయ కళాశాల సేద్య విభాగాధిపతి డాక్టర్ ఎన్. సునీత తిరుపతిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రానికి ప్రధాన శాస్త్రవేత్తగా బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ సునీతను పూలమాలలు, శాలువాతో సత్కరించారు. కళాశాలలో ఆమె అందించిన సేవలను అసోసియేట్ డీన్ డాక్టర్ టి. గోపికృష్ణ, విభాగాధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది కొనియాడారు. విద్యార్థులకు ఆమె అందించిన మార్గదర్శకత్వాన్ని గుర్తుచేసుకున్నారు. భవిష్యత్ బాధ్యతల్లోనూ ఆమె మరింత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.