ఉదయగిరి ARR ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం 57వ జాతీయ సేవా పథకం (NSS) ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి ప్రిన్సిపల్ ప్రకాశ్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్న వయస్సు నుంచే సేవా కార్యక్రమాలను అలవర్చుకోవాలని సూచించారు. సమాజ సేవలో భాగస్వాములై ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. NSS సమన్వయకర్త టి. రమేశ్ మాట్లాడుతూ సమాజ సేవ ద్వారా విద్యార్థులు బాధ్యత, క్రమశిక్షణ, సేవాభావం పెంపొందించుకుని ఆదర్శంగా ఎదగాలని అన్నారు. అనంతరం కళాశాల విద్యార్థులతో NSS ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, NSS వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఉదయగిరిలో ఘనంగా 57వ NSS ఆవిర్భావ దినోత్సవం