ఉదయగిరి SMGR ప్రభుత్వ వ్యవసాయ కళాశాలకు బదిలీపై వచ్చిన ఆరుగురు ఆచార్యులు వివిధ విభాగాల్లో బాధ్యతలు చేపట్టినట్లు అసోసియేట్ డీన్ గోపికృష్ణ తెలిపారు. డా. జి.ఎల్. శివజ్యోతి సేద్య విభాగాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. డా. మహేశ్వరరెడ్డి, డా. సంధ్యారాణి సేద్య విభాగంలో విధులు చేపట్టారు. డా. రామసుబ్బయ్య, డా. రాధాకృష్ణ మృత్తిక శాస్త్రం, వ్యవసాయ రసాయన శాస్త్ర విభాగంలో బాధ్యతలు స్వీకరించారు. డా. జి. త్రికళ మాధవి ఉద్యానవన విభాగంలో చేరారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఆచార్యులు విద్యార్థులకు నాణ్యమైన బోధన అందిస్తూ, వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికతపై అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని కళాశాల అధికారులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కళాశాల సిబ్బంది వారికి అభినందనలు తెలిపారు. కళాశాల అభివృద్ధికి సమన్వయంతో పనిచేసి విద్యార్థుల ప్రగతికి తోడ్పడాలని సూచించారు అందరూ.

ఉదయగిరిలో బాధ్యతలు చేపట్టిన ఆచార్యులు