Tuesday, 29 September 2026
  • Home  
  • ఇరుపాకను ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా మార్చేందుకు మాస్టర్ ప్లాన్ టిటిడి నిధులతో ఐదు ఆలయాల నిర్మాణం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
- తూర్పు గోదావరి

ఇరుపాకను ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా మార్చేందుకు మాస్టర్ ప్లాన్ టిటిడి నిధులతో ఐదు ఆలయాల నిర్మాణం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

కాకినాడ, జగ్గంపేట, పున్నమి ప్రతినిధి, – సెప్టెంబర్ 28:* కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాక శివ కేశవుల క్షేత్రంలో టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ నిధులతో నిర్మాణం జరుగుతున్న అష్టలక్ష్మీ సమేత లక్ష్మీనారాయణ ఆలయం, అయోధ్య రామ మందిరాన్ని పోలిన బాల రాముడి ఆలయం పనులను వేగవంతం చేసేందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతస్థాయి బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తో కలిసి దేవాదాయ శాఖ అధికారులు డి.ఎల్.వి. రమేష్ బాబు (డిప్యూటీ కమిషనర్), తోట దుర్గేష్ కుమార్ (సూపరింటెండింగ్ ఇంజనీర్), ఎన్. ఉదయ్ భాస్కర్ కుమార్ (డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ – స్థపతి), పి. సతీష్ (డిప్యూటీ స్థపతి), బల్లా శివ కుమార్ (అసిస్టెంట్ ఇంజనీర్ ఎల్.ఆర్.డి), చల్లా ఉదయ బాబు నాయుడు, గండేపల్లి గ్రూప్ టెంపుల్స్, తంటికొండ దేవస్థానం ఈవో, తిరుమల నుంచి శిల్పులు వచ్చి ఆలయాల నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించి, నిర్మాణ ప్రణాళికపై కూలంకుషంగా చర్చించారు. పలు సూచనలు, సలహాలు అందజేశారు. అనంతరం శివ కేశవుల ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల మణి అధ్యక్షతన బోర్డు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆలయ అభివృద్ధికి సంబంధించి మూడు కీలక తీర్మానాలు చేశారు.1. ఆలయ అభివృద్ధి కమిటీ రిజిస్ట్రేషన్2. ప్రతి నెల శ్రవణా నక్షత్రం సందర్భంగా భక్తుల చేతుల మీదుగా వెంకటేశ్వర స్వామికి అభిషేకం నిర్వహణ 3. నిర్మాణంలో ఉన్న ఆలయాలతో పాటు తలపెట్టిన మహా యజ్ఞం, కోటిలింగాలతో కోటిలింగేశ్వరుడి నిర్మాణంలో భక్తులందరూ భాగస్వాములు అయ్యే అవకాశం కల్పించడం ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ తిరుమల శ్రీవారి శ్రీవాణి ట్రస్ట్ నిధులతో ఇర్రిపాకలో 5 ఆలయాలకు నిధులు మంజూరు అయ్యాయని, అందులో అష్టలక్ష్మీ, బాల రాముడి ఆలయాలకు ఇప్పటికే శంకుస్థాపన జరిగిందని తెలిపారు. వాయు ప్రతిష్ట చేసిన శివ కేశవుల ఆలయాలతో పాటు గ్రామంలోని గణపతి ఆలయానికి కూడా నిధులు రానున్నాయని, అలాగే తంటికొండ దేవస్థానానికి 6 కోట్ల రూపాయల శ్రీవాణి ట్రస్ట్ నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు.దేవాదాయ శాఖ అధికారులు మాట్లాడుతూ సమర్థవంతమైన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కు టీటీడీ బోర్డు సభ్యుడిగా వెంకటేశ్వర స్వామి అవకాశం కల్పించడం వల్లనే ఈ ప్రాంతంలో ఆలయాలు ఇంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, పురాతన ఆలయాలకు శ్రీవాణి ట్రస్ట్ నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తున్నారని, ఇర్రిపాకను ఒక ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్తకొండ బాబు, కుంచెతాతాజీ, బదిరెడ్డి అచ్చన్న దొర, సత్తి సదాశివరెడ్డి, మలిరెడ్డి వెంకట శ్రీధర్, వై గోవిందు నాయుడు, బోదిరెడ్ల సుబ్బారావు ఇర్రిపాక శివకేశవుల క్షేత్రం అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

కాకినాడ, జగ్గంపేట, పున్నమి ప్రతినిధి, – సెప్టెంబర్ 28:*

కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాక శివ కేశవుల క్షేత్రంలో టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ నిధులతో నిర్మాణం జరుగుతున్న అష్టలక్ష్మీ సమేత లక్ష్మీనారాయణ ఆలయం, అయోధ్య రామ మందిరాన్ని పోలిన బాల రాముడి ఆలయం పనులను వేగవంతం చేసేందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతస్థాయి బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది.
ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తో కలిసి దేవాదాయ శాఖ అధికారులు డి.ఎల్.వి. రమేష్ బాబు (డిప్యూటీ కమిషనర్), తోట దుర్గేష్ కుమార్ (సూపరింటెండింగ్ ఇంజనీర్), ఎన్. ఉదయ్ భాస్కర్ కుమార్ (డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ – స్థపతి), పి. సతీష్ (డిప్యూటీ స్థపతి), బల్లా శివ కుమార్ (అసిస్టెంట్ ఇంజనీర్ ఎల్.ఆర్.డి), చల్లా ఉదయ బాబు నాయుడు, గండేపల్లి గ్రూప్ టెంపుల్స్, తంటికొండ దేవస్థానం ఈవో, తిరుమల నుంచి శిల్పులు వచ్చి ఆలయాల నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించి, నిర్మాణ ప్రణాళికపై కూలంకుషంగా చర్చించారు. పలు సూచనలు, సలహాలు అందజేశారు.
అనంతరం శివ కేశవుల ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల మణి అధ్యక్షతన బోర్డు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆలయ అభివృద్ధికి సంబంధించి మూడు కీలక తీర్మానాలు చేశారు.1. ఆలయ అభివృద్ధి కమిటీ రిజిస్ట్రేషన్2. ప్రతి నెల శ్రవణా నక్షత్రం సందర్భంగా భక్తుల చేతుల మీదుగా వెంకటేశ్వర స్వామికి అభిషేకం నిర్వహణ
3. నిర్మాణంలో ఉన్న ఆలయాలతో పాటు తలపెట్టిన మహా యజ్ఞం, కోటిలింగాలతో కోటిలింగేశ్వరుడి నిర్మాణంలో భక్తులందరూ భాగస్వాములు అయ్యే అవకాశం కల్పించడం
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ తిరుమల శ్రీవారి శ్రీవాణి ట్రస్ట్ నిధులతో ఇర్రిపాకలో 5 ఆలయాలకు నిధులు మంజూరు అయ్యాయని, అందులో అష్టలక్ష్మీ, బాల రాముడి ఆలయాలకు ఇప్పటికే శంకుస్థాపన జరిగిందని తెలిపారు. వాయు ప్రతిష్ట చేసిన శివ కేశవుల ఆలయాలతో పాటు గ్రామంలోని గణపతి ఆలయానికి కూడా నిధులు రానున్నాయని, అలాగే తంటికొండ దేవస్థానానికి 6 కోట్ల రూపాయల శ్రీవాణి ట్రస్ట్ నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు.దేవాదాయ శాఖ అధికారులు మాట్లాడుతూ సమర్థవంతమైన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కు టీటీడీ బోర్డు సభ్యుడిగా వెంకటేశ్వర స్వామి అవకాశం కల్పించడం వల్లనే ఈ ప్రాంతంలో ఆలయాలు ఇంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, పురాతన ఆలయాలకు శ్రీవాణి ట్రస్ట్ నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తున్నారని, ఇర్రిపాకను ఒక ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్తకొండ బాబు, కుంచెతాతాజీ, బదిరెడ్డి అచ్చన్న దొర, సత్తి సదాశివరెడ్డి, మలిరెడ్డి వెంకట శ్రీధర్, వై గోవిందు నాయుడు, బోదిరెడ్ల సుబ్బారావు ఇర్రిపాక శివకేశవుల క్షేత్రం అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.