ఖమ్మం: బ్యాంకు ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ఖాతాదారులకు ఇబ్బందులు కలగకుండా ఆదివారం కూడా బ్యాంకులు పని చేయనున్నట్లు ఖమ్మంలోని బ్యాంకు ఉద్యోగులు తెలిపారు. సోమవారం, మంగళవారం, బుధవారం మూడు రోజుల పాటు బ్యాంకు ఉద్యోగుల సమ్మె జరగనున్న నేపథ్యంలో ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవల్లో అంతరాయం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
సమ్మె కారణంగా ఖాతాదారులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఆదివారం బ్యాంకులు తెరిచి సేవలు అందించనున్నట్లు వెల్లడించారు. ఖాతాదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.



